ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్​లు​ బంద్​

 ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణలు నిలిపివేత


సోమవారం నుంచి సినిమా షూటింగ్​లు​ బంద్​


తెలుగు సినీ నిర్మాతలు కీలక నిర్ణయం


గిల్డ్‌ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్‌ మద్దతు



సినిమా చిత్రీకరణలను కొన్ని రోజులు ఆపాలని నిర్ణయం


తెలుగు ఫిలిం ఛాంబర్‌ నూతన అధ్యక్షుడు బసిరెడ్డి


*హైదరాబాద్ : తెలుగు సినీ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి షూటింగ్​లు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు చిత్రీకరణలు జరిపేది లేదని నిర్మాత దిల్​రాజు​ తెలిపారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణలు నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశంలో నిర్ణయించారు. గిల్డ్‌ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్‌ మద్దతు తెలిపింది.

టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదలపై చర్చే ప్రధాన అజెండాగా తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు షూటింగ్​లు నిలిపివేస్తామని ప్రముఖ నిర్మాత దిల్​రాజు తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న వాటికి కూడా బ్రేక్​ ఇస్తామని ఆయన చెప్పారు. సినిమా చిత్రీకరణలను కొన్ని రోజులు ఆపాలని నిర్ణయించినట్లు తెలుగు ఫిలిం ఛాంబర్‌ నూతన అధ్యక్షుడు బసిరెడ్డి తెలిపారు*


ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎవరూ సంతోషంగా లేరని ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి, చిత్ర పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టేందుకు ఏం చేయాలన్నది త్వరలో చర్చిస్తామని ఫిలిం ఛాంబర్‌ తెలిపింది. ఈ క్రమంలోనే 24 విభాగాల వారితోనూ చర్చలు జరుపుతామని పేర్కొంది. అంతకుముందు ఆదివారం ఉదయం తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి రెండు ఓట్ల తేడాతో గెలిచారు. ఆయనతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ పోటీ పడ్డారు. 42 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Comments