బంజారాల ఆరాధ్య దేవుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్— నవీన్ రాథోడ్

 బంజారాల ఆరాధ్య దేవుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్— నవీన్ రాథోడ్


సికే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంసంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవము. అతను హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారు.



జీవిత విశేషాలు

అతను 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్‌ జిల్లా రాంజీనాయక్‌ తండాలో జన్మించాడు. ఈయనకు సేవాలాల్‌ అని నామకరణం చేశారు. సేవాలాల్‌ పెరిగిన తరువాత కొంతకాలంలో మేరమ్మగా పిలువబడే జగదాంబ ప్రత్యక్షమైన సేవాలాల్‌ని నాకు అప్పజెప్పమని భీమనాయక్‌ను అడుగుతుంది. అమ్మ వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్‌ అందుకు ఒప్పుకోడు. తల్లిదండ్రులు సేవాలాల్‌ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాఖాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలచు కోలేదని అంటాడు. అప్పుడు మేరమ్మ సేవాలాల్‌కు ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. అయిన సేవాలాల్‌ చలించడు. చివరకు తండాలను, కష్టాల పాలు చేస్తుంది. ఇదంతా సేవాలాల్‌ కారణంగా జరుగుతుందని తండావాసులు, తండా రాజ్యం నుంచి ఆయనను బహిష్కరిస్తారు. కానీ అమ్మవారికి మేకలను బలి ఇవ్వకుండ అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు. వారి కోరిక మేరకు సాతీ భావానీలకు మేకపోతు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు. ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు. కాని సేవాలాల్‌ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించడు. ఎందుకంటే ఆయన అమాయక ముగ జీవుల్ని బలిచేస్తుంటే చూడలేక, ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్‌ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర పడేస్తారు. నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు. అమ్మవారు సేవాలాల్‌ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. ఇన్నాళ్లు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్‌ నెగ్గాడు. నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి సేవాలాల్‌ జగదాంబమాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. ఆరు నెలల ప్రాయంలోనే సేవాలాల్‌ కొండపైన చాముండేశ్వరీ దేవతా మూర్తులతో ఆటలు ఆడుకునేవాడు. సేవాలాల్‌- చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా భీమా నాయక్‌ గమనించి విచారిస్తే ప్రతిదినం అలాగే అడుకుంటామన్నాడు. పెరిగి పెద్దవాడైన సేవాలాల్‌ ఆవులు కాసేవాడు. తల్లిసద్ది కట్టిస్టే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులోనికి పోయేవాడు. ఒక బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు. ఈ విచిత్ర ప్రవర్తన తల్లితండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది.


బోధనలు


ఈ సమస్త జీవకోటికి మాతృరూపం (తల్లిగా) వెలిసిన అమ్మభవాని గురించి అమ్మను పూజించాలని, కాని ఫలితం ఆశించవద్దని బంజారాలకు బోధించారు. సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌గారు, అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుసుడయ్యారు. సేవాలాల్‌ మహరాజ్‌ ఆనాడు బంజార జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లీం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యింది. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మర్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్‌ అవతరించారు. సేవాలాల్‌ మహరాజ్‌ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుంది.


సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్‌’ ఒకటి ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం మొదలైనవి అన్ని ముఖ్యమైనవి

Comments