దళితబంధును అందరికీ ఇవ్వాలి టి స్కైలాబ్ బాబు

 రాజ్యాంగ రక్షణకై ఐక్య పోరాటాలు 


దళితబంధును అందరికీ ఇవ్వాలి


ఆగస్టు7 నుండి సంగారెడ్డిలో కెవిపిఎస్ రాష్ట్ర 3వ మహాసభలు


కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు


ఖమ్మం, జూలై 30 :- 


కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగం రిజర్వేషన్ల రద్దుకు దోహదం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు రాబందుల పాలవుతుందని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి టి స్కైలాబ్ బాబు విమర్శించారు. శనివారం కెవిపిఎస్ ఖమ్మం జిల్లా 4వ మహాసభలు ముత్తమాల ప్రసాద్, కొమ్ము శ్రీను, నందిపాటి పావని అధ్యక్షవర్గంగా మంచికంటి భవన్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కెవిపిఎస్ రాష్ట్ర మూడో మహాసభలు ఆగస్టు 7నుండి 9వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగనున్నాయని చెప్పారు ఆగస్టు 7న నీలిదండు కవాత్ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేరళ దేవాదాయ శాఖ మంత్రి డీఎస్ఎంఎం జాతీయ అధ్యక్షులు కె రాధాకృష్ణన్ ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు మాటల్లో దేశభక్తి చేతల్లో దేశద్రోహానికి పాల్పడుతున్న దని చెప్పారు.ప్రభుత్వ రంగ సంస్థలు కారుచౌకగా అమ్ముతూ రిజర్వేషన్లకు సమాధి చేస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి అశాంతి సృష్టింస్తుందని విమర్శించారు. రాజ్యాంగ మూల స్థంబాలను కూల్చుతుందన్నారు. రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం దేశవ్యాపిత ఉద్యమం చేపడుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంరాబందుల పరం అవుతుందన్నారు. దళితబంధు కోసం విశాల ఐక్య ఉద్యమం చేపడుతామని చెప్పారు ఈ సమావేశములో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ జిల్లా దళితుల సమస్యలపై, భవిష్యత్ ఉద్యమాల కర్తవ్యాలను వివరించారు. 

ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు మాచర్ల భారతి, బొట్ల సాగర్, పాపిట్ల సత్యనారాయణ, కుక్కల సైదులు, మట్టి దుర్గాప్రసాద్, మాగి భద్రయ్య, నకరికంటి చిరంజీవి, బండి రామ్మూర్తి, కిశోర్, జార్జి, ప్రభుదాస్, సర్వేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Comments