తెలంగాణకు కాబోయే సీఎం ఈటెలనే....!
డా.చొప్పరి శంకర్
ముదిరాజ్,ప్రధానకార్యదర్శి,
తెలంగాణ ముదిరాజ్
మాహాసభ...!
88017 21999.
సి కె న్యూస్:
ప్రత్యేక తెలంగాణరాష్ట్రంలో రెండవసారి అధికారపగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుండి ముఖ్యమంత్రి మార్పు జరగనుందని,కెసిఆర్ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారని,రాష్ట్రంలో తనకుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రిపదవి అధిరోహించబోతున్నారనే వార్తలు,వచ్చాయి.దానికనుగుణంగానే తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం,పార్టీలో మరియు ప్రభుత్వంలో ఎవరికీయలేనిస్థానం కేటీఆర్ కు ఇవ్వడం,రెండవసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా,బహిరంగ సమావేశాలకు ముఖ్యఅతిథిగా వెళ్లడం,మొదటి ప్రభుత్వంలో హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు అంతాతానై,
గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం అనేవి భవిష్యత్ లో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి దారులు వేసుకుంటున్నాడని అందరికీ తెలిసిన విషయమే.
ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఉద్యమంలో భాగంగా తొలిముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన,రాజకీయ సమీకరణాలలో భాగంగా అది వాస్తవరూపం దాల్చలేదు.
ప్రస్తుతం మరొకసారి ముఖ్యమంత్రి మార్పు అనేఅంశం తెరపైకివచ్చింది.
ఒకవేళ కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి పీఠాన్ని తనకుమారుడికి ఇవ్వకుండా,విద్యార్థి దశ నుండి పలుసమస్యలపై పోరాడి,తెలంగాణ రాష్ట్రసమితిపార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోఉంటూ,పార్టీ అధినాయకత్వం చెప్పినవిధంగా,తూ.చా.తప్పకుండా,నడుచుకుంటూ,తనవంతుబాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ,పార్టీబలోపేతానికి తనవంతు,పాత్రవహిస్తూ,ప్రత్యేక తెలంగాణరాష్ట్రంలో కీలకంగా పనిచేసి,వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించి తనవాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్న విషయం నగ్నసత్యం.
మనరాష్ట్రం ఆవిర్భవించాక 2014లో తొలి మంత్రివర్గంలో ఆర్థిక,ప్రణాళికశాఖ,చిన్నమొత్తాల,పొదుపు,రాష్ట్రలాటరీలు,పౌరసరఫరాలు,తూనికలు కొలతలు,వినియోగదారుల వ్యవహారాలశాఖ బాధ్యతలు నిర్వహించి,తనదైనశైలిలో ప్రత్యేకతను,చాటుకుంటూ,2019లో రెండవసారి ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖమంత్రిగా విధులు నిర్వర్తిస్తూ,ఆమధ్యన ఒక్కసారిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా నేపథ్యంలోఆరోగ్యశాఖమంత్రిగా విధులు నిర్వర్తించడంలో భాగంగ,డాక్టర్లు,పోలీసులు,
కార్మికులవలే తనప్రాణాలకు తెగించి,ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ,సమీక్షిస్తూ,కావలసిన వైద్యసామగ్రి,తదితర సౌకర్యాల ఏర్పాట్లకు పాటుపడుతూ,సిబ్బందిని ప్రోత్సహిస్తూ,అండగానిలిచి,ధైర్యం ఇస్తూ,తన బాధ్యతలను సక్రమంగానిర్వర్తించి ప్రజలచే అభినందించబడ్డారనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.ఈ విపత్కర సమయంలో రాష్ట్రప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు,మంత్రులు ఉన్నారన్నవిషయంకూడా ఎవరికీ తెలియదు. కానీ ఆరోగ్యశాఖమంత్రిగా ఈటలమాత్రం వీరందరినీ సమన్వయపరుస్తూ,కేంద్రంతో ఎప్పటికప్పుడు అన్నివిషయాలను తెలియజేస్తూ,మనరాష్ట్ర పరిస్థితులను పరిశీలిస్తూ,కావలసిన వనరులను సమకూర్చుతూ తమప్రాణాలకు తెగించి పనిచేశారనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా సూచించాలి.కానీ ఆలా జరగకపోగా,ఎప్పటికైనా తమ కుటుంబపాలనకు అడ్డొస్తాడేమోనని కక్ష్యగట్టడం జరిగింది.
రాష్ట్రంలో రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు అవునన్నా,కాదన్నా కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రులు కేటీఆర్,హరీష్ రావు మరియు ఈటెల తప్ప మిగతావారి ప్రస్తావన కరువైంది.అందులో సైతం కరోనీకరణలో కేవలం ఈటల రాజేందర్ మాత్రమే ఆరోగ్యశాఖమంత్రిగా సమీక్షలు,సమావేశాలు,పర్యవేక్షణ అంటూ తమ కుటుంబానికి దూరంగాఉంటూ ప్రాణాలకుతెగించి విధులు నిర్వర్తిస్తున్నారనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.ఇలాంటి వ్యక్తిపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ ఒకింత ఇబ్బందిపాలు చేయడం జరిగింది.ఈ విషయంలో సాక్షాత్తు ఈటలనే మీడియా సాక్షిగా తనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి ప్రభుత్వం ఎన్ని కమిటీలయినా వేసుకోవచ్చు.నిజనిర్ధారణ అయిన తరువాత తప్పు జరిగిందని తెలిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించడం ఆయనకే చెల్లింది.
అయినా దేశంలో ప్రతి రాజకీయ నాయకులపై విచారణలు జరిపి నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నది. కానీ కక్షగట్టేధోరణి అంతా సరి అయినది కాదు.19 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,అందులో మూడుపర్యాయాలు మంత్రిగా కొనసాగడం,తనపార్టీలో నమ్మినబంటుగా కొనసాగుతూ,రెండవస్థానం ఆక్రమించుకొని,తనకు ఏపనిని అప్పగించిన కృతనిశ్చయంతో నిబద్ధతగా,అలుపెరగకుండా శ్రమిస్తూ ఆ పదవికే వన్నె తెచ్చేవాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కరలేదు.
ఒక్కసారిగా ఈటెలపై అధికార పార్టీకి అనుమానాలు వచ్చి,చర్యలో భాగంగా ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
వెంటనే ఈటెల “ ఆత్మగౌరవం” అనే నినాదం ఎత్తుకొని రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల పెద్దలను,ప్రజాసంఘాల నాయకులను,తన నియోజకవర్గ ప్రజలను, విద్యార్థి సంఘాల నాయకులతో మొదలుపెట్టడంతో ఒక్కసారిగా కనివిని ఎరుగనిరీతిలో రాష్ట్రనలుమూలల నుండి మద్దతురావడం అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు.మొదట్లో నూతనపార్టీ ఆవిర్భావం అనేమాట వినిపించినా,తన రాజకీయ,అనుభవంతో,మేధావులు,నిపుణులతో సాధ్యాసాధ్యాలను చర్చించి,విశ్లేషించుకుని చివరికి తన లక్ష్యనెరవేరుటకు భారతీయ జనతాపార్టీ జరిపిన సంప్రదింపులు,ఇచ్చిన హామీలు ప్రస్తుత పరిస్థితులలో సరైనదిగా భావించి,ఢిల్లీలోని పార్టీ పెద్దలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుని,జూన్ 4న మీడియా సమావేశంలో అధికారపార్టీ యొక్క నిర్ణయాలు,మంత్రులపై అధినాయకత్వం ప్రవర్తిస్తున్న తీరు,పార్టీలో తానుపడ్డ ఇబ్బందులను తెలియజేస్తూ,తెలంగాణ రాష్ట్రసమితిపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ సభ్యులుగా రాజీనామా చేయడం జరిగింది.
రాజకీయాలలో ఒకనాయకుడిని అణగద్రొక్కాలన్నా ,పైకి తీసుకురావాలన్న క్షణంలో జరిగేపని.నిస్వార్థంతో సామాజికాభివృద్ధికి పాటుపడుతూ,సమాజ సంక్షేమమే ధ్యేయంగా భావించి పనిచేసే నాయకులకు సైతం ఒక్కసారిగా పాతాళంలోకి అణగద్రొక్కి కోలుకోలేనివిధంగా చేయవచ్చు.అలాగే ఏమితెలియని వ్యక్తిని ప్రణాళికయుతంగా అత్యుత్తమవ్యక్తిగా చిత్రీకరించే వెసులుబాటును రాజకీయాలలో చూడవచ్చు.ఇక్కడ ఒకప్రత్యేకమైన విషయం సంతరించుకున్నది.నిబద్ధతతో ప్రజలపక్షాన,నిలిచి,పనిచేసేవ్యక్తిని ఎంతగా
అనగద్రొక్కాలనుకుంటే అంతగా ఆదరణపొందే అవకాశం సైతం రాజకీయాలలో దాగిఉన్నది.
రాజకీయాలలో మనుగడ సాగించాలంటే ఒళ్ళంతా కళ్ళుచేసుకుని,అనుక్షణం పరిశీలిస్తూ,రాబోయేముప్పును సైతంపసిగడుతూ,ప్రజలలో ఆదరణపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంటుంది.ఈవిషయాలలో సైతం ఈటెల రాజేందర్ నూటికినూరుపాళ్లు విజయం సాధించి,అసలుసిసలైన రాజకీయవేత్తగా శాశ్వతంగా ముద్రవేసుకున్నారనడంలో ఎలాంటి అబద్ధం లేదు.
ఈటల రాజేందర్ రాష్ట్రంలో 56 లక్షల జనాభాకలిగిన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవాడైనా,మొదటి నుండి ఉద్యమనేపథ్యం కలిగిన వ్యక్తిగా,దళితబహుజనులకు అండగా ఉంటూ,వారి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపెడుతూ,అందరివాడిలా అజాతశత్రువుగా పేరుతెచ్చుకుని,తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అందుకేకాబోలు హుజురాబాద్ ఉపఎన్నికలలో ముఖ్యమంత్రితో సహా,రాష్ట్ర మంత్రివర్గం మరియు ఎమ్మెల్యేలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతిగ్రామాన్ని పంచుకోనీ పనిచేసి,వేలకోట్ల రూపాయలను వెచ్చించినా,
ప్రభుత్వపరంగా దళితబంధు లాంటి ఎన్ని పథకాలను తీసుకొచ్చిన,రాత్రింబవళ్లు అహర్నిశలు కష్టపడిన విజయాన్ని చేరుకోలేకపోయారు.
అంటే ప్రజల మనసుల్లో ఈటెల స్థానం ఎక్కడుందో అర్థంకాకమానదు.
భారతీయ జనతాపార్టీ ఈమధ్యన ఈటెలను పార్టీలో చేరికలకమిటీకి చైర్మన్ గా నియమించిన అప్పటినుండి వాటిఫలాలు ఏంటో తెలుస్తూనే ఉంది.ఇదంతా పరిశీలిస్తూ ఉంటే వచ్చే ఎన్నికలలో ప్రధానంగా పోటీ అనేది టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీల మధ్య ఉంటుందన్నది అర్థం అవుతుంది.
ఈ రెండుపర్యాయాలు టిఆర్ఎస్ పార్టీయొక్క పాలన చూస్తూ ఉంటే... మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు,నిరుద్యోగుల పాలిట పెనుశాపంగా మారింది,
ప్రత్యేకంగా వీరు ఇలాంటి తెలంగాణ రాష్ట్రంకోసం మేము పోరాటం చేశామా !అనుకునే విధంగా తయారయింది,
దళితులకు మూడెకరాల భూమి పంపకం ఊసేలేదు
,రైతుల రుణమాఫీకి దిక్కులేదు,డబుల్ బెడ్ రూమ్ కళలాగా మిగిలిపోయింది,కొత్త రేషన్ కార్డులు ఎలాఉంటాయో తెలియదు,వృద్ధాప్య,వితంతు పింఛన్లను దారి ఏటో తెలియదు,ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలురావు,తెలంగాణ ఉద్యమద్రోహులు సన్నిహితులయ్యారు,ఉద్యమకారులు పగవారయ్యారు.. ఇలా చెప్పుకుంటూపోతే “వ్రాస్తే రామాయణమంతా - చెబితే మహాభారత మంతా” ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
వీటన్నింటిని చూస్తుంటే రాబోయే ఎన్నికలలో బీజేపీపార్టీ అధికారం చేపట్టడం,అందులో ఈటల ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికీ బీజేపీని అధికారంలోకి,తీసుకురావడానికి,అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలపాలని ఆశిద్దాం.
Comments
Post a Comment