అభివృద్ధి ని చూసి ఓర్వాలేకపోతున్న బీజేపీ నాయకులు

 అభివృద్ధి ని చూసి ఓర్వాలేకపోతున్న బీజేపీ నాయకులు

 -జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే...




సి కే న్యూస్ జుక్కల్ ప్రతినిధి



జుక్కల్ శాసన సభ సభ్యుడు హన్మంత్ షిండే మాజీ ఎమ్మెల్యే అరుణ తార పై మండి పడ్డారు . తెరాస పార్టీ హయాంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలను వారి యొక్క సంక్షేమ పథకాలను ఓర్వలేక ప్రజల యొక్క మనస్సులను తప్పుదోవ పట్టడం జరుగుతుందని తెలిపారు . జుక్కల్ నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి తో గ్రామాలలో మౌలిక వసతులు , సదుపాయాలు  , గ్రామాలు ఆదర్శంగా ఏర్పడుతున్న  దృశ్యాలు వారికి కనబడటం లేదని తెలిపారు . రోడ్ల వ్యవస్థ అన్ని గ్రామాలకు సౌకర్యాలు ఏర్పరచడం జరిగిందని తెలిపారు .  నియోజక వర్గంలో అన్ని వర్గాల వారి యొక్క పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబ్యాసం చేసుకోవడానికి ఆయా గురుకుల విద్యాలయాల ద్వారా ఉజ్వల భవిష్యత్తు ను అందించి ప్రయోజకులు అయ్యే విధంగా తీర్చిదిద్దటం జరుగుతుందని తెలిపారు . ప్రశాంతమైన జుక్కల్ నియోజక వర్గన్నీ  పప్పు ఉడకాని  బీజేపీ నాయకులు    పని పాట లేకుండా ప్రజా గోస బీజేపీ భరోసా అంటూ ప్రజల యొక్క మనసత్వాన్ని గెలవలేరని తెలిపారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు కోరుకునే పాలన వారికి అందించి అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిచేకూర్చడం జరుగుతుందని తెలిపారు . కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ద్వారా జుక్కల్ నియోజక వర్గం కు కానీ తెలంగాణా రాష్ట్రానికి సహాయ సహకారాలు చేయకుండా గొప్ప గొప్పగా మాటలు మాట్లాడు తప్ప కార్యాచరణ శూన్యం అని తెలిపారు . జుక్కల్ నియోజక వర్గం ప్రాంతానికి స్థానికంగా ఉన్న నాయకుడిగా నియోజక వర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను తీర్చిదిద్దటం జరుగుతుందని తెలిపారు . గ్రామాలలో డప్పులు కొట్టిన బ్యాండ్లు కొట్టిన ప్రజలు బీజేపీ పార్టీకి నమ్మరని తెలిపారు . తెరాస పార్టీ   అభివృద్ధి చేస్తున్నాటువంటి నాయకులకు ప్రజలు ఆశీర్వాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు . ఒక్కరు కరీంనగర్ నుండి ఇంకొకరు నిజామాబాద్ నుండి వచ్చి సుగ్గిల కోసం డప్పులు కొట్టడం జరుగుతుందని తెలిపారు .  అభివృద్ధి , వ్యక్తిత్వం , వికాసత్వం , మచ్చలేని నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవాలు చేస్తున్న నాయకుడికి నియోజక వర్గం ప్రజల ఆశీర్వాదం తో మూడు సార్లు ప్రజలు ఎన్నికోవడం జరిగిందని తెలిపారు . ఇకనైనా బీజేపీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడం తగదు అని తెలిపారు .

Comments