వీఆర్ఏల అర్థనగ్న ప్రదర్శన

 6వ రోజు మండల కేంద్రంలో వీఆర్ఏల అర్థనగ్న ప్రదర్శన

       వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె ఆరవ రోజుకు కొనసాగింది.


ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తహశీల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసుకున్న షామియానాలో అర్థనగ్నంగా నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు అర్థనగ్నంగానే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏ హాసీన గారు మాట్లాడుతూ మాలాంటి చిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వంచన చేయడం ముఖ్యమంత్రి గారికి తగదని తక్షణమే హామీల అమలుకు రాష్ట్ర చర్చలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సమ్మెకు మద్దతు కలవాల్సిందిగా తహశిల్దారు గారికి కార్యాలయ సిబ్బందికి గులాబీ పువ్వులు అందించి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు దారా శ్రీనివాసరావు, అన్వర్ ఉపాధ్యక్షులు రమేష్, కోశాధికారి రవి గార్లు మరియు మండలంలోని అందరు వీఆర్ఏలు పాల్గొన్నారు..

Comments