గడ్డ కట్టిన అన్నం.... నీళ్ల చారు...
- ఇది మెనూర్ ఆదర్శ పాఠశాల తీరు
- ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు
- పట్టింపులేని పాలకులు అధికారులు
సి కే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
ప్రవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాలలో. వసతి గృహాలల్లో. కస్తూర్బా పాఠశాలలో ఆదర్శ పాఠశాలలు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థిని విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడానికి. ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఇచ్చినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు మొదలుకొని ఎమ్మెల్యేలు. మంత్రులు. ముఖ్యమంత్రి పదే పదే వేదికలపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ. అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు . కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లోని మేనూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నిర్వాకులు గడ్డకట్టిన అన్నం. ఉడికి ఉడకని నాసిరకం గుడ్లు. నీళ్ల చారు అందించి ప్రభుత్వ సొమ్మును దిగమింగుతూన్నారు. నిరు పేద విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులు చదవడానికి గురుకుల ఆదర్శ కస్తూర్బా వసతి గృహాల్లో చేరితే వీటిపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఇష్టారాజ్యం ఎలుతుంది. ఇప్పటికైనా కామారెడ్డి జిల్లాలో విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలల్లోనే పలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా లోని మారుమూల నియోజకవర్గమైన జుక్కల్ ప్రాంతంలో విద్యా వ్యవస్థ సక్రమంగా కొనసాగడం లేదు. వీరి పర్యవేక్షణ లేకపోవడం హాస్టల్లో నిర్వాహకుల్లే ఇష్టారాజ్యం ఎలుతుంది. పేద విద్యార్థులకు పొట్టను గొట్టి వారు ఆస్తులు పెంచుకుంటున్నారు. ఉన్నత అధికారులు వహిస్తున్న విషయాన్ని తెలుసుకొని ముందుగానే వసతి గృహాల్లో చక్కని వంటలు చేసి పెడుతున్నారు. ఆ తర్వాత యధా విధిగా గడ్డకట్టిన అన్నం. నీళ్ల చారు అందించి విద్యార్థుల పొట్ట కొట్టి ప్రభుత్వ సొమ్ములు ఇంకా మింగుచున్నారు. ఇప్పటికే జిల్లాలో సరైన పౌష్టికాహారం స్పందించడం లేదంటూ విద్యార్థులు అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ వారు. పట్టించుకోకపోవడంతో. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు ఆకలికి ఆల్మట్టిస్తున్నారు. మారుమూల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మద్నూర్ మండలం మేనూర్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సరైన మెనూ ప్రకారం పౌష్టిక హారం అందించకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు విద్యార్థులు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో. గడ్డ కట్టిన అన్నం. నీళ్ల చారు అందించి తమ కడుపు కొడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఇది ఇలా ఉండగా విద్యా బోధన చేయడానికి కావాల్సినంత అధ్యాపకులు లేక విద్య బోధన సక్రమంగా సాగడం లేదు.ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల విద్యా బోధన అందించడానికి సరైన ఉపాధ్యాయ లేక తమకు విద్య బోధన సక్రమంగా అందడం లేదంటూ మేనూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి తిండి సక్రమంగా లేక అర్థ ఆకలితో ఆల్మట్టిస్తున్నామని. విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నారు . ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులు ఆదర్శ పాఠశాల రావడంతో వారికి వండిన అన్నం. నీళ్ల చారు చూపెట్టినప్పటికీ వారు చూసి వెళ్లారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అన్నం లేక. మరోవైపు తాగడానికి మంచినీరు లేక బోరు నుంచి వచ్చే ఉప్పు నీళ్లు తాగి కడుపు నింపు కోవాల్సిన పరిస్థితి నెలకొంది అంటూ విద్యార్థులు బోరు మంటున్నారు. ఇప్పటి కైనా స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పందించి మేనూర్ ఆదర్శ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు కోరుతున్నారు. లేనియెడల మండల విద్యా శాఖ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
Comments
Post a Comment