వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం: ఎంపీటీసీ శేఖర్

 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం: ఎంపీటీసీ శేఖర్ 


సి కె న్యూస్ పినపాక ప్రతినిధి:



 శనివారం  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక  మండలంలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల అమరారం గ్రామంలో  ప్రత్యేక వైద్య శిబిరం డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వరద ముంపు ప్రాంతంతో ఉండడంతో కల్వర్టులు దాటుకుంటూ వైద్య సిబ్బంది గిరిజన గ్రామం అయిన అమరారం గ్రామపంచాయతీలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అమరారం యుపిఎస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిన్నపిల్లలకు సమయానికి అనుగుణంగా టీకాలు వేయించాలని కూడా తెలిపారు. మీ ఇంటికి ఆరోగ్య కార్యకర్తలు వచ్చినప్పుడు ఆరోగ్య సర్వేకు కూడా సహకరించాలని తెలిపారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని , నిరంతరం వైద్యులు అందుబాటులో ఉంటారని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు

Comments