వేయి కోట్లకు 'సాహితీ స్కెచ్'

 వేయి కోట్లకు 'సాహితీ స్కెచ్'


● సంగారెడ్డిలో వెలుగు చూసిన ప్రోజెక్ట్ మాయ


● కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన


● భయపడేది లేదని 'అనంచిన్ని' స్పష్టం




తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వేలకోట్ల స్కాం. మెయిన్ మీడియాకు భయం. తెగించి రాసిన పరిశోధన పాత్రికేయుడిని బెదిరించిన ఆడియో హల్చల్. వెంటనే ఆ పాత్రికేయుడి కారుపై దుండగుల దాడి. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం. ఈ అవినీతి సొమ్ము చేరాల్సిన చోట భద్రంగా చేరింది. (వచ్చే మంగళవారం నాటి సంచలన కథనం అదే.!) ఇప్పుడు తాజాగా ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ చేసిన వేయి కోట్ల ఘనకార్యాలలో ఇప్పుడు ఒకటి చూద్దాం.

ఎక్కడ మొదలు..:

సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 343/8, 9, 11, 12, 13లలో ఉన్న '23 ఎకరాల్లో టవర్ల నిర్మాణం' అంటూ మోసానికి తెరలేపారు. ఒక్కొక్కరికి ఒక్కో ధర.. రూ.2,400 నుంచి రూ.3,500దాకా ఇష్టమొచ్చిన రేట్లకు ఫ్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో బుకింగ్ తీసుకోవడంతో పాటు డబ్బులు ముందుగానే చెల్లిస్తే మరిన్ని రాయితీలు అంటూ నమ్మబలకడంతో జనం ఎగబడి కొనుగోలు చేశారు. 2019లో బుకింగ్ మొదలెట్టేశారు. అయితే హెచ్ఎండీఏ అనుమతులు రాలేదు. దీంతో పనులు ముందుకు సాగలేదు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తిచేసి అప్పగిస్తామని నమ్మించిన నిర్మాణసంస్థ మొండిచేయి చూపింది. 23 ఎకరాలల్లో పది టవర్లు నిర్మిస్తామన్నారు. తమ సంస్థ ద్వారా నిర్మిస్తున్న అతిపెద్ద వెంచర్ అని, ఇక్కడ 3,500 ఫ్లాట్ నిర్మిస్తామని చెప్పారు. వందశాతం పేమెంట్ ముందుగానే చేస్తే చదరపు అడుగుకు రూ.3,500లకే ఇస్తామని చెప్పడంతో చాలామంది డబ్బులు కట్టారు.

గడువు ముగుస్తున్నా...:


సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎం డి లక్ష్మీనారాయణ. అధికార పార్టీ నేతలు.. ఇతర రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలని అంటున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ప్రిలాంచ్ సమయంలో చాలా మాటలు చెప్పారు.. తర్వాత కూడా రకరకాల ప్లాన్లు చెప్పారు. ఈ వ్యవహారం తేడాగా ఉండటంతో కొంత మంది తమ ప్లాట్లను రద్దు చేసుకున్నారు. వారికి కూడా అరకొరగానే  డబ్బులు ఇచ్చారు. అసలు నిర్మాణం చేపట్టకపోగా భూమిని కూడా అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలియడంతో బాధితులు రగిలిపోతున్నారు.  పోలీసులు కూడా మా పిర్యాదు పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు.

బజారెక్కిన బాధితులు:

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ వద్ద 'సాహితీ శర్వాని ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో 'ప్రీ లాంచ్ ఆఫర్' అంటూ వందలాది మందికి టోకరా వేశారు. బాధితుల పక్షాన మీడియా నిలబడటంతో  న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరిగింది. వందల కోట్ల మేర దండుకుని మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.


భయపడేది లేదు: అనంచిన్ని వెంకటేశ్వరరావు


అన్యాయం, అక్రమాలను ఎదిరించే విషయంలో తమ జర్నలిస్టులు కేసులను, జైళ్ళనే లెక్క చేయలేదు. ఆప్ట్రాల్  ఈ దాడులకు ఎలా భయపడతారు.? జర్నలిస్టులు ఈ నీచులకి ఎందుకు భయపడాలి.? జర్నలిజం అంటే బాధ్యతతో చేసే పని. కన్నా, బుజ్జీ, కట్టా ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళను వేలల్లో చూశామని... ఈ అక్రమార్కుల సంపాదన అంతా... ఎంతో కొంత ఒక పార్టీకి చేరాయనే ఆధారాలే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని, మంగళవారం వాటిని బరటపెడతాం.

Comments