బోరున ఏడుస్తున్నా.. కారులోంచి అర్పితను లాక్కెళ్లారు..

 కోల్‌కతా: బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్‌ స్కామ్‌లో అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆమెను మరోసారి జోకా ఈఎస్ఐ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.

అక్కడ చాలా నాటకీయ సన్నివేశం చోటుచేసుకున్నది.


కారులో ఉన్న అర్పిత బయటకు వచ్చేందుకు నిరాకరించింది. ఏడుస్తూనే సీట్లోనే కూర్చుండిపోయింది. అయితే భద్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా కారులోంచి దించారు. ఆ తర్వాత చెకప్ కోసం హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తున్న సమయంలో ఆమె ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ వద్ద రోడ్డుమీదే కూర్చుకున్నది. ఆ తర్వాత ఆమెను వీల్‌చైర్‌పై తీసుకువెళ్లారు. అర్పితకు చెందిన రెండు ఫ్లాట్ల నుంచి ఈడీ 50 కోట్ల నగదు రికవరీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి 48 గంటలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఈఎస్ఐ ఆస్పిటల్‌కు రెండు వేరు వేరు కార్లలో అర్పిత, పార్ధాలను తీసుకువచ్చారు. పార్టీ నుంచి మిమ్ముల్ని తొలగించారని, దీనిపై మీ కామెంట్ ఏంటని మాజీ మంత్రి పార్ధాను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన రియాక్ట్ అవుతూ.. కుట్రలో నన్ను ఓ బాధితుడిని చేశారని అన్నారు. టీచర్ స్కామ్‌లో ఇరక్కున్న ఇద్దరూ ప్రస్తుతం ఈడీ ఆధీనంలో ఉన్నారు.

Comments