చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీఏ) ఏప్రిల్ 2023 సంవత్సరానికి గాను 60వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 31వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సులకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీఏ) ఏప్రిల్ 2023 సంవత్సరానికి గాను 60వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 31వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సులకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: మొత్తం 191 ఖాళీలు ఉన్నాయి. ఇందులో షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్ పోస్టులు175, ఎస్ఎస్‌సీ (టెక్) ఉమెన్ పోస్టులు 14తో పాటు విడోస్ డిఫెన్స్ పర్సనల్ పోస్టులు 2 ఉన్నాయి.
విభాగాలు: సివిల్/ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ తదితర విభాగాలు ఉన్నాయి.
అర్హత: ఎస్ఎస్‌సీ(టెక్) మెన్/ విమెన్ - సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎస్ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ)- ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్ఎస్‌సీ విడో (టెక్నికల్)-బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. ఎస్ఎస్‌సీ (టెక్) మెన్/ ఉమెన్ క్యాండిడేట్స్‌కు 20- నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్‌సీ విడో (టెక్నికల్)- అభ్యర్థులకు 35 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్స్: చివరి సెమిస్టర్/ ఏడాదిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సమాచారం కోసం www.joinindianarmy.nic.in వెబ్సైట్ చూసుకోవాలి.
Comments
Post a Comment