బాలలు తాము ఆత్మగౌరవముతో ఎదగడానికే బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు

 బాలలు తాము ఆత్మగౌరవముతో ఎదగడానికే బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు


-జిల్లా సంక్షేమ అధికారి ఈపి ప్రేమలత 


ములుగు,సికే న్యూస్



జిల్లా బాలల పరిరక్షణ విభాగము ములుగు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ శారదా అధ్యక్షతన బాలలను లైంగిక నేరాలనుండి రక్షించే (పొక్సో) చట్టం 2012 బాల్య వివాహ నిషేధ చట్టాలపై  విద్యార్థు లకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమాధికారి ఈ పి ప్రేమలత మాట్లాడుతూ బాల్యం నుండే విద్యార్థులు చక్కని నడవడి కతో ఎదగాలని సూచించారు. ఒకరితో పోల్చుకోకుండా మనలో ఉన్న ప్రతికూలతలను మన ఎదుగుదలకు అనుకూలంగా మలుచుకోవాలని తద్వారా విజయ తీరాలను చేరుకోవాలని సూచిం చారు.నేడు చాలా మంది బాలికలు ప్రేమ పేరున మోసపోటు తమ జీవితాలను నాశనం చేసుకుంటు న్నారాని స్వల్పకాలిక ప్రలోభాలకి మోసపోవద్దని క్షణికావేశానికి లోనయ్యి బంగారు భవిష్య త్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల సంరక్షణ కొరకు ఎన్నో గొప్పగొప్ప చట్టాలను రూపొందిం చామని వాటిపై బాలబాలికలకి అవగాహన కల్పించడము ద్వారా బాలబాలికలు ఆపదలో ఉన్న ప్పుడు తాము చట్టపరంగా రక్షణ పొందడము జరుగుతుందని అన్నారు.అనంతరము సహాయ కార్మిక అధికారి వినోద  మాట్లా డుతూ 14 సం.ల లోపు బాల బాలికలంతా విద్యా హక్కు చట్టం ను అనుసరించి తప్పనిసరిగా బడిలోనే ఉండాలని పనికి వెళ్ళ రాదని ఒకవేళ ఎవరైనా పనికి వెళ్లినట్లైతే పనిలో పెట్టుకున్న వారికి అదేవిధంగా 15 నుండి 18 సం.ల లోపు పిల్లలను  హానికరమైన పని లో పెట్టుకుంటే వారికి చట్టపరంగా కఠినమైన శిక్షలు అనగా జైలు శిక్ష మరియు జరిమానా విధించడం జరిగుతుందని తెలిపారు.అనంత రము బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ స్వాతి మాట్లాడుతూ ఈ చట్టాలు కేవలము బాలికలకోసము మాత్రమే కాదని 18 సం.ల లోపు వయస్సున్న బాలుర హక్కుల పరిరక్షణ కోసం కూడా ఉద్దేశించినవని తెలిపారు. విద్యార్థులంతా తమ దృష్టిని చదువుపైనే నిలపాలని చదువుని మాత్రమే ప్రేమించాలని అప్పుడే గొప్ప స్థాయికి ఎదగగలమని సూచించారు.అనంతరము జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్  మాట్లాడుతూ లైంగిక నేరాలనుండి బాలలను రాలసించే చట్టం బాల్య వివాహ నిరోధక చట్టం -2006 ను గురించి వివరించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ గా ఉన్న వారు బాలిక అయినా లేదా బాలుడు అయినా గాని ఎలాంటి లింగ భేదం లేకుండా వారిని వేధించిన వారికి కఠిన శిక్షలుంటాయని కనీస జైలుశిక్ష  సనీసం 7 సం.ల నుండి జీవిత ఖైదు ఉంటుందని బాధితులైన మైనర్ వయస్సు 13 సం లలోపు ఉంటే నేరము తీవ్రతను బట్టి ఉరిశిక్ష కూడా విధించే అవకాశం ఉంటుం దని అన్నారు.ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం -2006 గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బాల్య వివాహాలు జరిపించ డానికి ఎన్నో విధాలా కారణాలు ఉన్నప్పటికీ ఆ బాల్య వివాహాలు ఆ మైనర్ బాలబాలికల శారీరక మానసిక ఆరోగ్య విద్య సామాజిక  ఎదుగుదలకు అవరోధంగా మారు తున్నాయని అన్నారు.19 సం. ల వయస్సున్న అమ్మాయి అదే విధంగా 22  సం.ల వయస్సున్న అబ్బాయిలు మాత్రమే వివాహాఁ చేసుకోవడానికి చట్టం అనుమ తిస్తోo దాని అన్నారు.ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి 2 సం. ల జైలు శిక్ష 1 లక్ష రూపాయల జరిమా నా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అన్నారు.బాలబా లికలం తా ఏమైనా వేధింపులు లేదా ఇబ్బందులకి గురయ్యినప్పుడు  తప్పనిసరిగా చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి ఫోన్ చేసి ఫిర్యాదు అందించవచ్చని మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని సూచించారు.అనంతరము ఈ కార్యక్రమానికి  సభాధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ శారదా మాట్లాడుతూ విద్యార్థు లంతా తమను తాము తక్కువ అంచనా వేసుకోరాదని ప్రతీ ఒక్కరు తమను తాము బలవం తులుగా భావించుకున్నప్పుడే విజయాన్ని పొందగలుగుతామని అన్నారు.ఈ సందర్భంగా ఈ అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించిన మహిళాభి వృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారు లను అభినందిస్తూ వారికి ధన్యవా దాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యా ర్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments