- Get link
- X
- Other Apps
తిరువూరు పట్టణ పరిధిలో సినీఫక్కీలో బంగారు షాపులో చోరీ, ప్రభుత్వ అధికారులను సైతం వదలని సైబర్ నేర గాళ్ళు.
ఉదయం అంతా రెక్కీ చేశారు.. రాత్రికి అందరు వెళ్లిపోయాక వచ్చారు. కానీ దొంగతనం చేయాలనుకున్న గోల్డ్‌షాపు తాళాలు పగలకొట్టకుండా.. పక్కనే ఉన్న టైలర్ షాపు తాళాలు పగలకొట్టారు. లోపలకి వెళ్లి వెంటతెచ్చుకున్న సామాగ్రితో. గోడకు కన్నం వేశారు.
ఆ రంధ్రం ద్వారా పక్కనే ఆనుకుని ఉన్న గోల్డ్‌షాపులోకి ఎంటర్ అయ్యారు. అక్కడ కంటికి కనిపించిందంతా దోచేశారు. సినీఫక్కిలో జరిగిన ఈ దొంగతనం తిరువూరు పట్టణంలోని ప్రధాన మార్గంలో ఉన్న గోకుల్ జ్యువెలర్స్ దుకాణంలో జరిగింది.
read also కింద పడేసి కుమ్మేసిన గేదె.. కారు కిందకు వెళ్లిన కూడా వదల్లేదు..
గోల్డ్ షాపు యజమాని వెంకటాద్రి మంగళవారం ఉదయం వచ్చి పక్కనున్న టైలర్ షాప్ తాళాలు పగలగొట్టి ఉండటానికి గమనించాడు. టైలర్ షాపులో ఏమైనా దొంగతనం లాంటిది జరిగిందా ఏంటి అనుకుంటూ లోపలికి వెళ్లి చూడగా. అక్కడ కనిపించిన దృశ్యాలకు ఖంగుతిన్నాడు. ఆ షాపు నుండి తన గోల్డ్‌షాపుకు మధ్యలో గోడకు కన్నం వేసి ఉండటంతో కంగారుగా వెళ్లి చూశాడు. ఏముంది షాపంతా ఖాళీ.. లబోదిబో అంటూ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీఐ భీమరాజు, ఎస్ఐలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు గోడకు కన్నం వేసి గోల్డ్‌షాపులో చొరబడి..చోరీ చేసినట్లు గుర్తించారు. ప్రాథమికంగా ఎనిమిది కిలోల వెండి, 200 గ్రాములు బంగారం ఆభరణాలను అపహరించినట్లు యజమాని వెంకటాద్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గిఫ్ట్‌కార్డు కావాలంటూ ప్రభుత్వ అధికారులకే.!
అమెజాన్ గిఫ్ట్ కార్డు కావాలి అంటూ భూగర్భ జల శాఖలోని ఉన్నతాధికారి నల్లూరి శ్రీనివాస్ ఫోన్‌కు వాట్సప్లో ఓ మెసెజ్ వచ్చింది. ఎవరూ ఈ మెసెజ్ చేశారా అని చూస్తే.. జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఫొటో ఉంది. తన పైఅధికారే కదా అని గిఫ్ట్ కార్డు పంపబోయారు శ్రీనివాస్.
కానీ ఎందుకో చివరి నిమిషంలో అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశారు. చివరికి కేటుగాళ్లు తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని తేలడంతో షాక్ అయ్యారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాచవరానికి చెందిన నల్లూరి శ్రీనివాస్ భూగర్భ జలశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆఖరికీ సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ అధికారులను కూడా వదలడం లేదు.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment