వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు మద్దతుగా నిలిచిన జన సైనికులు

 వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు మద్దతుగా నిలిచిన జన సైనికులు

CK NEWS Avanigadda.కృష్ణాజిల్లా

అవనిగడ్డ నియోజకవర్గం



అవనిగడ్డ గ్రామం లోని మండలిపురం కాలనీ లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు మద్దతుగా నిలిచిన జన సైనికులు, మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు.


ఈ నిరసన జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న స్థానిక MLA సింహాద్రి రమేష్ బాబు గారు, నిరసన ను చూసుకుంటూ స్పందించ కుండా వెళ్లిపోవటం సిగ్గు చేటు.


తీవ్ర దుర్ఘంధభరితమైన మురుగు నీరు ఇళ్ల చుట్టూ చేరి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదంలో ఉన్న అవనిగడ్డలోని మండలిపురం కాలనీకి తక్షణమే కృష్ణాజిల్లా కలెక్టర్ వచ్చి సమస్యలు పరిశీలించాలని నిరుపేద నివాసితులు కాలనీలో ఆందోళనకు దిగారు. కాలనీలో రోడ్డుపై బైటాయించి తమ కాలనీని తక్షణమే జిల్లా కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించి మురుగు బయటకు తోడించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments