సీకే న్యూస్ ఎఫెక్ట్
గత రెండు నెలల క్రితం నాలుగు నెలల బాబు చనిపోవడం జరిగింది...
CK న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం
సారపాక పంచాయతీ శ్రీరాంపురం ఎస్టి కాలనీ కి చెందిన దంపతుల కు పుట్టిన బాబు నాలుగు నెలలు సడన్గా ఒకరోజు జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకు వెళుతున్న సమయం లో రోడ్డు మార్గం సరిగా లేకపోవడం వలన బాబు దారి మధ్యలోనే చనిపోవడం జరిగింది అట్టి విషయాన్ని సికే న్యూస్ కథనంలో ప్రచురించటం జరిగింది.ఇట్టి విషయంపై ఉన్నత జిల్లా వైద్య అధికారులు 2/8/2022 నాడు హెల్త్ క్యాంప్ పెట్టి అక్కడ ఉన్న మూడు గుంపుల ప్రజలకు మెడిసిన్స్ గర్భిణీ స్త్రీలను టెస్ట్ చేయటం చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఆరోగ్య ల పట్ల అవగాహన కల్పించడం కావలసిన వారికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది.హెల్త్ క్యాంపు పెట్టే విషయంలో సీకే న్యూస్ ప్రధాన పాత్ర పోషించిందని శ్రీరాంపురం ఎస్టి కాలనీ చింతకుంట మరియు ఇరువెండి ఎస్టి కాలనీకి సంబంధించిన ప్రజలు సి కె న్యూస్ ప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపినారు...
సీకే న్యూస్ వరుస కథనాలకు స్పందించిన అధికార యంత్రాంగం...
CK న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీలో శ్రీరాంపురం ఎస్టీ కాలనీ కి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా ఉండటం మూలాన పలుమార్లు సీకే న్యూస్ వరస కథనాలు ప్రచూరించడం జరిగింది.
దీనికి స్పందించిన అధికార యంత్రాంగం అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు మనుషులు కూడా నడవలేని పరిస్థితిలో ఉండటం వలన 2 /8 / 2022 నాడు సారపాక పంచాయతీ అధికారులు బ్లేడు ట్రాక్టర్ తో సదును చేసి వాహనాలు వెళ్లే విధంగా చేసినారు. శ్రీరాంపురం ఎస్టి కాలనీ రోడ్డు సదును చేసినందుకు సీకే న్యూస్ వరుస కథనాలు వల్ల అధికారులు స్పందించి మాకు వాహనాలు వెళ్ళే విధంగా చేసినందుకు సి కె న్యూస్ ప్రతినిధికి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపినారు...
Comments
Post a Comment