మేఘమాల ముదిరాజ్ హంతకుల కేసు ఏమయింది

మేఘమాల ముదిరాజ్ హంతకుల కేసు ఏమయింది

సి కె న్యూస్ కామారెడ్డి ప్రతినిధి



మేఘమాల మృతికి కారకులైన హంతకులను కఠినంగా శిక్షించాలి.ఇప్పటికే ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా పోస్ట్ మార్ట్ రిపోర్ట్ రాకపోవడం తీవ్ర అనుమానాలకు దారితీస్తుంది.అంటే ఆ అమ్మాయి,బిసి కులానికి చెందిన ముదిరాజ్ బిడ్డ అయినందుకా ? ముదిరాజ్ కులానికి చెందినందుకా?ఇంత పెద్ద కమ్యూనిటీ చెందిఉన్నా.. కూడా ఎవరు అందుబాటులో లేరంటే అర్థం కావట్లేదు.అసలు అసలు విషయానికొస్తే..

దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన మైనర్ బాలిక మేఘమాలపై అత్యాచారంచేసి,హత్య చేసిన ఘటన,జులై నెల 14న మేఘమాల శవం కుంటలో లభించిన ఇప్పటివరకు పోస్టుమార్టం రిపోర్టు,ల్యాబ్ రిపోర్ట్ రాకపోవడం పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ముదిరాజ్ నాయకులు ఆరోపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ మహిళలపై అరాచకాలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి,బడుగు,బలహీన వర్గాల మహిళలకు అన్యాయం జరిగితే సత్వర న్యాయం జరగడం లేదు.రాష్ట్ర హోం మంత్రి మహిళలపై అత్యాచార సంఘటనల పై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.తెలంగాణ రాష్ట్రంలో పేద బాలికలు,మహిళలకు రక్షణ కరువైందని చెప్పవచ్చు. 

     గతంలో మహిళలపై అత్యాచారాలు,వేధింపులు,హత్యలు జరిగాయి,2012 లో ఏకంగా యావత్తు దేశం మహిళల పక్షాన నిలిచి,అన్నా హజారే,అరవింద్ కేజ్రీవాల్,కిరణ్ బేడీ పలువురి సమక్షంలో మహద్యోమంగా జరిగి,దేశంలోని అన్నీ రాష్ట్రాల నుండి అనేక మందిని పాల్గొనేలా చేసి,స్వాతంత్రోద్యమాన్ని గుర్తుకుతెచ్చుకునేలా పలు నిరసనల కార్యక్రమాలను చేపట్టి అప్పటి కేంధ్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి నిర్భయ చట్టాన్నీ చేయడానికి దారితీసింది.ఆ తర్వాత పలురాష్ట్రాలలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు సైతం మహిళల క్షేమం కోసం,అసెంబ్లీలలో చట్టాలు చేయడం,తెలంగాణలో షీ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.కొంతమేర తగ్గిన అక్కడక్కడా ప్రేమవేధింపులు,అత్యాచారాలు,యాసిడ్ దాడులు సైతం కొనసాగుతూనే వున్నాయి. 

ప్రవేట్ చిట్ పండ్ చిట్టిదారులు జాగ్రత్త...

   ఇదిలా ఉంటే ప్రస్తుతతరుణంలో దేశంలోని సంఘటనలు చూస్తే సగటు మానవుని తీవ్ర ఆందోళనలను గురిచేస్తున్నదనడంలో ఎలాంటి భయం అక్కర్లేదు.నేడు మహిళలతో పాటు చిన్నారులకు భధ్రత కరువైంది.

   పొద్దున లేవగానే ఏ దినపత్రిక చూసిన,సామాజిక మాధ్యమాలు పరిశీలించిన ఏదో ఒకచోట చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలు కన్పిస్తూనే ఉంటాయి.కూతురిని వేధిస్తున్న తండ్రి,పాఠశాలలో చిన్నారిపై ఉపాద్యాదాయిడి అఘాయిత్యం ఇలా బందువులు,మిత్రులు,ప్రక్కింటి వారు చిన్నారులపై ఇలాంటి చర్యలకు పూనుకున్నారంటే,మన సమాజంలో ఏం జరుగుతుంది?ఎందుకు వారికీ ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి? తాత ,తండ్రి స్థానంలో ఉండి ఎందుకు విచక్షణ జ్ఞానాన్నీ కోల్పోతున్నారు?అంటే మానవత్వం మంటగలుస్తున్నదా ? వీరికి బహిరంగంగా ఎలాంటి శిక్షలు విధిస్తే,సమాజంలో మార్పు వస్తుంది.చిన్నారులకు అండగా వుంటూ,నాలుగు మంచి విషయాలను చెబుతూ,వారిని సక్రమైన మార్గంలో పయనింపజేయడానికి కృషి జేస్తూ,భవిష్యత్ తరానికి ఉత్తములుగా పరిచయం చేయాల్సిన మనుషులు,మానవ మృగాలుగా తయారవుతున్నారంటే ఏమని సంభోదించాలి ? మనమెలాంటి అభివృద్ధికి పరుగులెడుతున్నామో అర్థంగానీ పరిస్థితి నెలకొంది . 

   రెండు దశాబ్దాల క్రితం వరకట్న వేధింపులు , గృహహింసలు ఎక్కువగా ఉండేవి , వాటితో సమానత్వం లేకపోగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు , ప్రభుత్వము సైతం ఆ విషయంలో ఆలోచించి , పలు సంఘటనలను విశ్లేషించి, తగిన చర్యలో భాగంగా బాల్య వివాహాలను నిరోధించాయి , అక్షరాస్యత లేమి కారణంగా మహిళలు పలు సమస్యల పాలుపడుతున్నారని విద్యాభివృద్ధికి కృషిచేశారు,1993 లో వరకట్న నిషేధ చట్టాన్నీ తీసుకొచ్చారు .ఐపీసీ 498 ఏ ప్రకారం గృహహింసకు పాల్పడితే పలు శిక్షలు సైతం ఏర్పాటు చేశారు .ఇన్నీ జరిగిన, నేటికీ అక్కడకూడా పలువురు మహిళలు ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారంటే ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు .

  ఇదిలా ఉంటే ఒక దశాబ్ద కాలం క్రితం 2008 సంవత్సరంలో గిరిజన తండాలలో మగసంతానకోసం పలువురికి జన్మనిస్తూ,అమ్మాయిలు పుడితే భ్రూణ హత్యలకు పాల్పడటం సంచలనం రేకెత్తించింది,జిల్లా అధికారులు ముందుకొచ్చి,మీ పిల్లలను చంపకూడదు,మీకొద్దనుకుంటే ప్రభుత్వ హాసుపత్రి ఆవరణంలో ఉయ్యాలలు కట్టి,అందులో వుంచిపోవాలని పిలుపునిస్తే ఒక దేవరకొండలోనే ఎంతోమంది ఉయ్యాలలో పడుకోబెట్టి పోయిన సందర్భాలను చవిచూశాము.  

  సమాజానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేసిన,మహిళలను,చిన్నారుల బాగోగులు చేసుకోకపోయినా సరే,దుశ్చర్యలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షిస్తే,వారి శిక్షలు చూసి అవతలివారికి అలాంటి పాడు ఆలోచనలు రాని విధంగా ఉండేటట్లు ప్రభుత్వాలు చట్టాలను తెస్తూ,కఠినంగా అమలుపరిచినప్పుడే మనమనుకున్న దాడులను కొంతమేర తగ్గించడానికి వీలవుతుంది.కావున ఆ దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. 

ఇలాంటి పరిస్థితులు జరగడానికి మూలకారణాలను పరిశీలిస్తే . . . 

✓ మొట్టమొదటిది మద్యం అని చెప్పకతప్పదు.ఒక సంస్థ జరిపిన సర్వేలో ప్రపంచ లిక్కర్ వినియోగంలో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానంలో ఉండటం,2022 నాటికీ 1,680 కోట్ల లీటర్ల అమ్మకాలు ఉండవచ్చని అంచనా వేయడం,దానికి మించి జరగడం.

✓ 15 నుండి 25 సంవత్సరాల వయసులోనున్న యువత వివిధ రకాల డ్రగ్స్ కు,మద్యానికి బానిసలై ఉన్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

✓ వివిధ నెట్ వర్క్ లు అందుబాటులోకి వచ్చి పోటీ పడుతూ ఇంటర్నెట్ డాటాను అతి తక్కువ ధరలకు అందిస్తూ,నేటి యువతను చెడుమార్గంలో పయనింపజేయడానికి దోహదబడుతుంది.వీటి వినియోగంలో సైతం మనదేశం అగ్రగామిగా నిలిచింది 0.అందులో అశ్లీల చిత్రాలను,దృశ్యాలను చూస్తూ వారికీ పాడుబుద్దులు కలగడానికి దోహదబడుతుంది . 

   ఇలాంటి ఘటనలను నియంత్రించాలంటే . . . 

✓ ప్రభుత్వాలు అఘాయిత్యాలను అరికట్టడంలో భాగంగా ప్రజలను,యువతను ఆలోచింపజేసేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రేరణాత్మకమైన విషయాలను అందించాలి.

✓ ఏరులై పారుతున్నా మద్యాన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరుగా భావించకుండా అమ్మకాలను నియంత్రించాలి.

✓ కఠినమైన చట్టాలను చేస్తూ పటిష్టంగా అమలుపరుస్తూ ఇలాంటి ఘటనలకు కారణమైన నిందితులను బహిరంగంగా కఠినంగా శిక్షిస్తూ,భవిష్యత్ లో ఇలాంటి ఆలోచనలు మరొకరికి కలుగకుండా భయపడేలా చర్యలు తీసుకోవాలి.

✓ దేశంలో,రాష్ట్రంలో ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు మద్దతు ప్రకటిస్తూ చర్యలు తీసుకరావడంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.

✓ ప్రభుత్వాలు పట్టించుకోలేని సందర్భంలో దేశంలోని ప్రతిఒక్కరు ఎలాంటి బేధాలు లేకుండా మనవారికే ఇలాంటి ఘటన జరిగిందని ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి కృషి చేయాలి.

✓ కేవలం సాంకేతిక,వాణిజ్య విద్యకే ప్రాముఖ్యతనివ్వకుండా పాఠశాల తరగతుల నుండి అత్యున్నత చదువుల వరకు అన్ని విభాగాలలో సోదరభావతత్వాన్ని,సేవాతత్వాన్ని,సమగ్రతను చాటిచెప్పే పాఠ్యంశాలను ప్రవేశపెట్టి వారిలో ఉత్తమ జ్ఞానాన్ని పెంపొందించాలి.

✓ కుటుంబంలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ విచక్షణ రహితంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవడానికి పాటుపడాలి. 

  భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు అగ్రకుల పక్షపాతంగా ఉంటూ స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు విద్య అందకుండా చేయడం ప్రజలలో సరి అయిన జ్ఞానం పెంపొందించే లేకపోవడం వల్ల ఇటువంటి దుష్పరిమాణాలు సంభవిస్తున్నాయి.

 దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినవి అయినా బాధ్యత వహించాల్సి ఉంటుంది.బడుగు,బలహీన వర్గాలు ఈ కుతంత్రాన్ని గుర్తించాలి.ఎప్పుడైతే ప్రజలు జ్ఞానాన్ని పొందగలుగుతారో,అప్పుడు ఈ సమస్యలు కనుమరుగవుతాయి.

 ప్రభుత్వాలు విద్యపట్ల సరైన ప్రత్యేకశ్రద్ధ చూపించాలి.బడుగు,బలహీన వర్గాలకు వారి జనాభా దామాషాలో విద్యాసంస్థలు,ఉద్యోగాల్లో,రిజర్వేషన్లు అమలుచేయడం ద్వారా విద్యావ్యాప్తి చేయడం ద్వారా ప్రజలు చైతన్యవంతులవుతారు.అలాగే యువతకు ఉపాధవకాశాలు లభించేలా చేయడం వారికి పూర్తిస్థాయిలో పనిపట్ల శ్రద్ద పెంపొందించడం వల్ల ఇటువంటి చెడుమార్గాలు అవలంబించకుండా సన్మార్గంలో నడిచేలా చూడాలి.

   మద్యపాన నియంత్రణ,మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించడానికి చట్టాలు చేసి కఠినంగా అమలు చేయాలి.ఇవ్వన్ని జరగాలనీ,వీటికోసం ప్రతిఒక్కరు పాటుపడతారని ఆశిద్దాం.

Comments