పశువుల తొట్టిలో ప్లేట్స్ కడుగుతున్న విద్యార్థులు

 పశువుల తొట్టిలో ప్లేట్స్ కడుగుతున్న విద్యార్థులు


* స్వచ్ఛ పరిరక్షణ ఎక్కడ....?

* పర్యవేక్షణ లేని పేరెంట్స్

   కమిటీ

* విద్యార్థులపై పట్టింపు లేని

   పాఠశాల



సి కె న్యూస్ కామారెడ్డి ప్రతినిధి


అసలే కరోనా టైం ప్రభుత్వం ఎంతగానో జాగ్రత్తలు చేపడుతున్నప్పటికీ కొన్నిచోట్ల పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్న తీరు వర్షాకాలం సీజన్లో వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాలోని ఉన్నత అధికారులు పదేపదే చెబుతున్న మార్పు మాత్రం శూన్యం అనే చెప్పవచ్చు వివరాలలోకి వెళ్తే

కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల్ యాడారం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల లో వాటర్ లేక పశువుల తొట్టిలో ప్లేట్స్ కడుగుతున్న విద్యార్థులు..!

ఇట్టి విషయమై హెడ్మాస్టర్ ని పలువురు ప్రశ్నించగా పాఠశాలలో ఉన్న మోటార్ చెడిపోయిందని వివరణ ఇచ్చారు. విద్యార్థులకు గత్యంతరం లేక ఈ పశువుల తొట్టిలో వర్షపునీరు ఆధారంగా స్టోరేజ్ అయిన వాటర్ ను పిల్లలు ప్లేట్స్ కడుక్కోవడం జరుగుతున్నది. ఇలాంటి వాటర్ వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున పాఠశాల యాజమాన్యం గాని పేరెంట్స్ కమిటీ ఆలోచించి పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించాలని పలువురు విశ్వసిస్తున్నారు.

Comments