ప్రవేట్ చిట్ పండ్ చిట్టిదారులు జాగ్రత్త....

ప్రవేట్ చిట్ పండ్ చిట్టిదారులు జాగ్రత్త....

సి కె న్యూస్ కామారెడ్డి ప్రతినిధి



చీకటి దందాల్లో ఈడీ దాడుల్లో  చికోటి ప్రవీణతో పాటు , గట్టు వామనరావు దంపతుల హత్య, శీలం రంగయ్య, మంథని మధుకర్ హత్య  విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ  ఎమ్మెల్యే , ప్రస్తుత జడ్పీ చైర్మన్ తో పాటుగా ప్రైవేట్  చిటీఫండ్,భవిత శ్రీ,భువన సూర్య డేవేలపర్స్, టాప్ తెలుగు టీవీ , అతిధి రిసార్ట్స్ చైర్మన్ ఐనా మాజీ మేయర్ వరంగల్ , మరియు ఎండి కూడా ఈ చికోటి తో లావాదేవీల్లో , విదేశాలకి డబ్బు తరలించడం, హవాలా చేయడం లో ముఖ్య పాత్రా పోషించారని ఈడీ విచారణలో తెలిసిందని ముఖ్య సమాచారం ..వాళ్ళ ప్రైవేట్  చిటీఫండ్ ఒక్కసారి ఈడీ ఆధీనంలోకి తీసుకుందంటే  అందులో ఉన్న చిట్టి డబ్బులు అన్ని ఆపేస్తారు .. ఈడీ దాడులు ఆపాలని కేంద్రప్రభుత్వం కి సంబంధించిన పార్టీ లో వీరందరూ చేరుతారు అని , వారితో చర్చలు కూడా జరిగాయి అని నిన్ననే ఢిల్లీ వెళ్లిన చర్చల కమిటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ బీజేపీ పెద్దలని కలిసి ఈ ఈడీ దాడుల గురించి కూడా చర్చ జరిగిందని గుసగుసలు వినబడుతున్నాయి ..


వీళ్ళద్వారానే గట్టు వామన రావు దంపతుల హత్యకేసులో కూడా మాజీ ఎమ్మెల్యే పారిపోవడం లో , కేసు నుండి , చార్జిషీట్ నుండి కూడా తప్పించడం లో హవాలా ద్వారా బాగా చేతులు మారాయి అని వాటిద్వారా అరెస్ట్ వారంట్ ఉన్న కూడా సులువుగా తప్పించుకున్నాడని , అంత వాళ్లేదగ్గరుండి చూసుకున్నారని , దీనికి మధ్యలో రామగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ముఖ్యపాత్ర పోషించాడని , హత్యకేసులో ఉన్న వారికీ బెయిల్ కోసం ఈ రామగిరి నాయకుడు కూడా ఢిల్లీ వెళ్లి హవాలా మనీ ని పంపిస్తాం బెయిల్ చూసుకోండి అని ఢిల్లీ న్యాయవాదులతో మాట్లాడుకొని అతిత్వరలో బెయిల్ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది .. అందుకే ఇతను చట్టవిరుద్ధంగా ఎన్ని చేసిన, అతను ఇల్లు నిర్మించుకోవడానికి, కార్లు కొనడానికి , తన కూతురు డాక్టర్ చదువుకోవడానికి, మండలంలో ఎవరి భూమి నైనా, ప్రభుత్వ భూమి, దేవాలయం భూములు, పట్టాదారు భూములైన కబ్జా చేయడానికి, కూడా ఈ జడ్పీ ఛైర్మెన్ ఏ దగ్గరుండి చూసుకుంటున్నాడు .  ఏమి లేని నాయకులూ ఇలా కోట్లకి పడగలెత్తరు అంటే మాములు విషయం కాదు , అతి ఖరీదైన ఇల్లులు , వ్యవసాయ క్షేత్రాలు , ఖరీదైన కార్లు , వేల ఎకరాల్లో భూములు ,వేరే రాష్ట్రాల్లో ఆసుపత్రులు , హోటళ్లు , విదేశాల్లో హోటళ్లు , వేల కోట్ల రూపాయలు, విదేశీ ప్రయాణాలు  , చట్టవిరుద్ధంగా చేస్తేనే గా ఇవ్వన్నీ సంపాదించేవి. అన్ని కోల్పోయి మొదటి సారి ఎమ్మెల్యే ఐతే ఇన్ని వేల కోట్ల రూపాయలు , ఇంత ఆస్థి, బినామీల , కుటుంబ సభ్యుల పేర్ల మీద సంపాదించడం అంటే మాములు విషయం కాదు , నిన్న గాక మొన్న మంథని కి వచ్చిన మంత్రి హరీష్ రావు కూడా ఖరీదైన ఇంటిని ,ఆస్తులను చూసి  షాక్ కి గురయినట్లు ,అక్కడి నాయకులతో ముఖ్యమంత్రి కి కూడా ఇంతటి విలాసవంతమైన భవనం లేదనట్లు ఆ రోజు మంత్రి తో ఉన్న నాయకులూ ,కార్యకర్తలే బాహాటంగా అన్నారని వాళ్ళ పార్టీ వాళ్లే చెప్పారు ..  ఇలా చెప్పుతుంటూ పోతే కోకొల్లలు ....   ఇలా చట్టవిరుద్ధంగా చేసే పనులు చేస్తేనే , ఇలాంటి చిటీఫండ్ వాళ్ళకి హవాలా ద్వారా సహాయం చేస్తేనే వాళ్ళు కూడా అదే పరిధిలో ఎలక్షన్లకు చిట్టి ఏజెంట్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చిట్టి ఏజెంట్ల ద్వారానే మండలాలకు చేరుస్తారని, ఇలాంటి సహాయాలు చేస్తారు ....

ఇప్పటికైనా చిట్టి వేసిన వాళ్ళు , ఆ చిటీఫండ్ కంపెనీ నుండి డబ్బులు రావాల్సిన వాళ్ళు ఆ చిటీఫండ్ బోర్డు తిప్పకముందే మీ మీ ఏజెంట్ ల ద్వారా , అక్కడ ఉన్న బ్రాంచ్ ల ద్వారా డబ్బులు సేకరించుకోండి..

Comments