ఎమ్మెల్సీ కవిత లిక్కర్ మాఫియా పై బీజేపీ ప్రశ్నిస్తుందని....?
- ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ...?
- ఇప్పటి వరకు సంగ్రామ యాత్రలో ఎక్కడైనా శాంతి
భద్రతలకు భంగ వాటిళ్లిందా.!
- ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రజా సంగ్రామ యాత్ర జరిపి
తీరుతాం...!
- బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర కు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజామ్ సాగర్ చౌరస్తా వద్ద రెండు గంటల పాటు ధర్నా నిర్వహించి అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయటం జరిగింది.ఈ సందర్బంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రెండు విడతల ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని 3 వ విడత సంగ్రామ యాత్ర కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతున్న క్రమంలో ఢిల్లీలో డొంక లాగితే తెలంగాణ లో ఎమ్మెల్సీ కవిత కు లిక్కర్ మాఫియాతో సంబంధం ఉన్నట్టు తీగ కదలటం తో ఆరోపణల నుండి ప్రజల ద్రుష్టి మరల్చడానికి శాంతి భద్రతల పేరుతో ప్ర్జజా సంగ్రామ యాత్ర ను అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ఎక్కడికక్కడ అవినీతి చేసుకుంటూ ప్రజా స్వామ్యాన్ని ఖుని చేస్తూన్న అధికార తెరాస ప్రభుత్వం ప్రజా స్వామ్య యుతంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే బీజేపీ పై పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే పోలీసులతో అనుమతి నిరాకరించారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో యాత్ర కోన సాగించి తీరతామని పునరుద్ఘాటించారు.
ఈ ధర్నా కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయటం జరిగింది. అని బిజెపి శ్రేణులు తెలిపారు.
Comments
Post a Comment