అభయ హస్తం ఎక్కడ...?
నిధులు దారి మళ్లింపు ఏమయ్యింది..?
సికె న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
డ్వాక్రా మహిళా సంఘాల్లో పనిచేస్తున్న సభ్యుల నుంచి ఏడాదికి 365 రూపాయలు జమ చేస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 365 రూపాయలు జబ్ వచ్చేసి 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్లు ఇవ్వడానికి అభయ హస్త పథకాన్ని 2009లో వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు .అప్పట్లో పొదుపు సంఘాల సభ్యుల నుంచి ఇంద్ర కాంతి పథకం అధికారులు డబ్బులు వసూలు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభయ్ హస్తం పథకాన్ని నిలిపి వేశారు. 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లు చూపి అభయ హస్తానికి బ్రేక్ వేశారు
రాష్ట్రంలో21 లక్షల మంది మహిళలకు చెల్లించాల్సిన వాటా ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. దాదాపు రూ.వెయ్యి కోట్లను సర్దుబాటు చేయలేక పంపిణీని ఆపేసింది. ఆసరా పింఛన్లు ఇస్తున్నామని చెప్పి అభయహస్తం పింఛన్లను ఆపేసిన సర్కారు.. మహిళలు చెల్లించిన వాటాధనాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. మే నుంచే వాటాధనం రీ పేమెంట్స్ను సిద్దిపేట జిల్లా నుంచి మొదలుపెట్టారు. కానీ, సిద్దిపేట ఒక్క జిల్లాలోనే దాదాపు రూ. 50 కోట్ల వరకు అందజేసి. ఆ తర్వాత నిలిపివేశారు. వాటాధనంతో పాటుగా వడ్డీని చెల్లించాల్సి రావడం,
వాటికి నిధులు సర్దుబాటు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో పెండింగ్లో పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో ప్రారంభమైంది. ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న మహిళలకు 60 ఏండ్లు నిండిన తర్వాత ప్రతినెలా రూ.500 నుంచి రూ.2 వేల వరకు పింఛన్ను అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 59 ఏండ్లలోపు ఉన్న మహిళలు తమ పేరు నమోదు చేయించుకొని వయసు ఆధారంగా తమ వాటా డబ్బులు ప్రతిఏటా రూ.365 చెల్లించారు. ఈ డబ్బులకు ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో జమ చేసి బీమా కంపెనీలకు అందజేసేది. ఇదిలావుండగా టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్లను రూ. వెయ్యికి, 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2016కు పెంచింది. అంతేకాకుండా 57 ఏండ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు రూ.2016 ఇస్తామని ప్రకటించారు. దీంతో పింఛను తీసుకుంటున్న వారిలో స్వయం సహాయక సంఘాల సభ్యులూ ఉన్నారు. దీంతో అభయహస్తం పెన్షన్లను ప్రభుత్వం ఆపేసింది.సర్కారు వాటా ఇవ్వకపోవడంతో..తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పింఛన్లనుఅపేయడమే కాకుండా.. ప్రతి ఏడాది ఇవ్వాల్సిన వాటాను సైతం విడుదల చేయలేదు. 2016 నుంచి దాదాపు ప్రభుత్వ వాటాను ఇవ్వలేదు. ఇదే సమయంలోనూ మహిళా గ్రూప్ సభ్యులు కూడా ఏటా ప్రీమియం డబ్బులను చెల్లించడం మానేశారు. దీంతో ఎస్ఐసీ దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసింది. తమ వద్ద ఉన్న వాటిని వెనక్కి ఇస్తామని చెప్పింది.
అభయహస్తం పథకంలో మహిళల నుంచి ఏడాదికిరూ.365 ప్రీమియం వసూలు చేసి, ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది. మొత్తం ఎల్బీసీకి చెల్లించింది. వయస్సును బట్టి నెలకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛన్ ఇవ్వడమే కాకుండా.. ప్రీమియం చెల్లించే సమయంలో సభ్యురాలు మరణిస్తే బీమా మొత్తం కుటుంబ సభ్యులకు అందుతుంది. బీమాతో పాటు, పింఛను కూడా లభించే ఈ పథకాన్ని ఆపేశారు. దీంతో ఎసీ రెండేండ్ల కిందట్నే తమ వద్ద ఉన్న కార్పసఫండ్ రూ. 2 వేల కోట్లను తిరిగి వాపస్ చేసింది. అభయహస్తంచెల్లింపులు లేవని, దీంతో పథకం ఆపేస్తున్నట్లుగా చెప్పిన ఎల్ఎస్ఐసీ ఇక నుంచి తమకు సంబంధం లేదని, క్లెయిమ్ల కోసం తమ వద్దకు రావొద్దని తేల్చి చెప్పేసింది. ఇటీవల ఎల్ఎస్ఐసీ నుంచి ప్రభుత్వం రూ.2 వేల కోట్లను డ్రా చేసుకుంది.ఏండ్ల నుంచి అభయహస్తం పథకంపై ప్రభుత్వం స్పందన లేకుండా పోయింది అభయ్ అస్తం అందించడంలో సరి అయిన తీసుకోలేకపోయింది 1. అయితే, ఎల్బీసీ నుంచి తీసుకున్నవాటిలో ముందుగానే వెయ్యి కోట్ల వరకు వాడుకుంది. ఆ తర్వాత రూ.1075 కోట్లను సెర్ఫ్ ఖాతాకు బదిలీ చేసింది. 2019 నుంచి ఇప్పటిదాకా ఈ సొమ్ము సెర్చ్ ఖాతాలోనే ఉంది. దీనిపై వచ్చే వడ్డీ కూడా పెరిగింది. ఇదంతా మహిళల సొమ్ము కావడంతో వడ్డీని కూడా వారికే చెల్లించాల్సి ఉంటోంది. అయితే, ఈ ఏడాది మేలో అభయహస్తం సొమ్మును మహిళలకు రిటన్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం రూ.1075 కోట్లు ఇస్తామని చెప్పారు. మహిళా సంఘాల్లో ఉన్న వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా సెర్ఫ్ ఖాతాలో ఉన్న వెయ్యి కోట్లను ప్రభుత్వం బదిలీ చేసుకుంది. కానీ, ఇప్పటి వరకు మహిళలకు ఇవ్వడం లేదు. ఈ సొమ్మును ప్రభుత్వం పక్కకు మళ్ళించారు. ఇతర పనులకు వాడుకుందని అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు.రాష్ట్రంలో మొత్తం 44 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉంటే 21 లక్షల మంది అభయహస్తం వాటా చెల్లించారు. వారికి ముందుగా ద్వారా రూ.545 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు కేవలం సిద్దిపేట జిల్లాలో మాత్రం కొంత మేరకు ఇచ్చారు. దీనికి సంబంధించిన వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించుకోవడంతో.. వాపసు చేసేందుకు నిధులు లేకుండా పోయాయి. దీంతో అభయహస్తం చెల్లించిన స్వయం సంఘాల సభ్యులకు అందకుండా పోయాయి.
Comments
Post a Comment