అఖిలపక్షం జేఏసీ కి మద్దతుగా బట్టా విజయ్ గాంధీ ...*

 *అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలం బందుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరపున పాల్గొన్న బట్టా విజయ్ గాంధీ ...* 

 *గోదావరి ముంపునకు గురైనా బూర్గంపహాడ్ మండలం ను పోలవరం ముంపు మండలంగా గుర్తించాలి...* 

 *బూర్గంపహాడ్ మండలం కేంద్రంలోని ముంపు గురైనా గ్రామాలను గుర్తించి బాధిత కుటుంబాలను పొలవరం R&Rప్యాకేజీ ప్రకటించాలి...*

CK న్యూస్ ప్రతినిధి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం

ఈ సందర్భంగా బట్టా విజయ్ గాంధీ  మాట్లాడుతూ

బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 11 వ రోజు కి చేరిన నిరవధిక రిలే నిరహార దీక్షలు బూర్గంపహడ్ మండలాన్ని పోలవరం ముంపు మండలంగా ప్రకటించి మెరుగైన ప్యాకేజ్ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సమగ్ర పరిహారం ఇవ్వాలని కోరుతూ.

అనంతరం ముంపు ప్రాంత ప్రజలకు న్యాయబద్ధమైన గోదావరి ముంపు సమస్యను పరిష్కరించాలని గోదావరి వరద వలన మునిగిపోయిన ఇండ్లు నేటికీ కూడా చమ్మగానే ఉన్నాయని దీనివలన చిన్న పిల్లలకు ముసలివారికి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని భవిష్యత్తులో కూడా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

 మండలంలోని గోదావరి ముంపు గ్రామాల కు శాశ్వత పరిష్కారం చూపించాలని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ను కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. 

గోదావరి ముంపు కారణంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయల నష్ట పరిహారం నేటికీ అసలైన బాధితులకు ఎంతోమందికి అందలేదని తక్షణం వారందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు  అదేవిధంగా ముంపు బాధిత గ్రామాలను సర్వే ఆధారంగా గుర్తించి పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 *ఈ దీక్షా కార్యక్రమంలో .* 


కాంగ్రెస్ బీజేపీ సీపీఐ సీపీఎం-తెదేపా పలు పార్టీల నాయకులు ముంపుగ్రామాల ప్రజలు-JAC కమిటీసభ్యులు స్థానిక ఉద్యోగులు మండల పెద్దలు-పలువార్డుల సభ్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలుసంఘాల నాయకులు-కార్యకర్తలు పాల్గొన్నారు...

Comments