కుసుమ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆర్థిక సహాయం


 కుసుమ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆర్థిక సహాయం


మంగపేట,సికే న్యూస్


ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్ పిలుపు మేరకు సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడు ముల లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు శుక్రవారం మంగపేట మండలం బోర్ నర్సాపురం గ్రామానికి చెందిన ఇర్సవడ్ల మురళి (37) అనారోగ్యంతో ఇటీవలే మృతిచెందగా విషయం తెలు సుకొని కుసుమ చారిటబుల్ ట్రస్ట్  ద్వారా బాధిత కుటుంబ సభ్యులను  పరామర్శించి 25 కేజీల బియ్యం 2 వేల రూపాయిలు ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం వారు  సొసైటీ డైరెక్టర్ నర్రా శ్రీధర్,మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి జానపట్ల విష్ణు గంధం కిషోర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని కుసుమ చారిటబుల్ ట్రస్ట్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లూరు దేవస్థానం డైరెక్టర్ యర్రంశెట్టి రామకృష్ణ, మండల యూత్ ఉపాధ్యక్షులు గౌని రమేష్,మాజీ ఎంపీటీసీ ముగల రమేష్ జ్యోతి,డాక్టర్ కరివర్ధన్, రావుల మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments