*గ్రామాల్లోని గుట్కా దందా జోరు*
*సీకే న్యూస్ ప్రతినిధి బోనకల్ (ఆగస్టు 16)*:
మండల పరిధిలోని గ్రామాల్లోని ఉన్న కిరాణా షాపుల్లో అంబర్లు,పాల్ బార్లు,విరిగా అమ్ముతున్నారు,అయినా గాని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు,మరి ముఖ్యంగా కొన్ని గ్రామాల్లోని పాఠశాలలకు,గుడులకు కనీసం 100 మీటర్ల దూరం కూడా లేకుండా బేల్డ్ షాపులు నడపడం విడ్డూరంగా అనిపిస్తుంది,పాఠశాలకు దగ్గరగా కిరాణా దుకాణాల్లో మద్యం బాటిళ్లు మరియు , అంబర్, కైని గుట్కా పాన్ బార్, లాంటివి,అమ్ముతున్నారు, మద్యం బాటిల్లో ఈ బెల్ట్ షాపు దగ్గర కొని దగ్గర్లో ఉన్న స్కూల్లోకి వెళ్లి అక్కడ తాగుతూ స్కూల్లోనే వదిలేస్తున్నారు, అక్కడ అవే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు,ఇప్పటికే యువత తప్పు దోవపడుతున్న తరుణంలోని గ్రామాల్లోని, గ్రామాల్లోని వారికి చేరువుగా ఉండటంతో ఇలాంటి వానికి బానిసై యువత పక్కదోవ పట్టి చెడిపోతున్నారు,ఇలాంటి వాటిపై అధికారులు అవగాహన సదస్సులు మరియు గ్రామాల్లోని అనుమతి లేని వాటిపై చర్య తీసుకోవాలని పలువురు వాపోతున్నారు,ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి వాటిని అరికట్టడంలోని అధికారులు విఫలమయ్యారని విశ్లేషకులు వాపోతున్నారు ఇంకా గ్రామాల్లోని,అంబర్ కైని గుట్కాలు బందు చేయకపోతే ఇంకా పిల్లలు పెద్దలు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మహిళలు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, పోలీస్ మండల అధికార యంత్రాంగం,కనీసం పాఠశాల,దేవుడి గుడి దగ్గరలో ఉన్న వాటిని తొలగించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
Comments
Post a Comment