- Get link
- X
- Other Apps
వీరు తీసే ప్రాంక్ వీడియోస్ వలన కొందరు సఫర్ అవుతున్నారు.ప్రాంక్ వీడియోస్ అనేవి ఇతరుల పర్మిషన్ లేకుండా షూట్ చేస్తారు.సడన్‌గా భయపెట్టే విధంగా కొందరి చర్యలుంటాయి.
తాజాగా ఓ పెళ్లిమండపంలో పెళ్లి షూటింగ్ జరుగుతుంటుంది. అయ్యగారు మంత్రాల అనంతరం తాళి కట్టాలని వరుడికి సూచిస్తాడు.అతను లేచి వధువుకు తాళి కడుతుండగా అప్పటికే చేతిలో కత్తి పట్టుకుని ఎదురుచూస్తున్న అమ్మాయి అబ్బాయిని పొడిచేందుకు ప్రయత్నిస్తుంది. వెంటనే అప్రమత్తమైన వరుడు తప్పించుకుంటాడు.నిజానికి అదంతా షూటింగ్ సీన్. అక్కడ జరిగే సీన్ గురించి అమ్మాయికి, అబ్బాయితో పాటు అందరికీ ఐడియా ఉంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా మేరకు వైరల్ అవుతున్నాయి. వీటిని ఎందుకు తీస్తున్నారనంటే ఎవరైనా తమలోనే టాలెంట్ బయటపెట్టేందుకు అని కొందరు చెబుతుంటారు. మరికొందరు సమాజంలో ఫేమస్ అవ్వడానికి అని అంటున్నారు.
ఇంకొందరు మాత్రం మెయిన్ గా డబ్బుల కోసం నటిస్తుంటారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేయడం వలన వ్యూస్, లైకులు, షేర్ల ఆధారంగా ఇన్‌కమ్ జనరేట్ అవుతుంటుంది. అందుకోసమే నేటితరం యువత కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్, ప్రాంక్ వీడియోలు తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని కొందరు అంటున్నారు.ఏదేమైనా ఇతరుల వ్యక్తిగత స్వేఛ్చకు భంగం కలుగనంతవరకు ఏం కాదని, లేనియెడల అది కూడా క్రైం అఫెన్స్ కిందకు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment