*బదిలీపై వెళ్తున్న ఎస్సై జీవన్ రాజుకి ఘన సన్మానం...*
*బూర్గంపహాడ్ మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...*
CK న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ నందు ఎస్సై జీవన్ రాజు బదిలీపై వెళ్తున్న సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను మరియు పుష్పగుచ్చాలు అందజేశారు.
బూర్గం పహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రాజు మండలానికి ఎన్నో విశిష్ట సేవలందించాలన్నారు మండల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ తనదైన సేవలో ప్రజలకు సేవలందించి పోలీసులు అంటే ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని ప్రజలతో కలిసి వారికి సేవలు అందించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సారపాక టౌన్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను టిఆర్ఎస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచంద్రరావు సారపాక టౌన్ యూత్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సోము చైతన్య రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు బిట్రు సాయిబాబా బెజ్జంకి కనకాచారి భూక్య శీను గాంధీ నగర్ మణి తుమ్మల కిరణ్ తదితరులు పాల్గొన్నారు...
Comments
Post a Comment