మా గోడు వినిపించుకోండి అంటున్న వరద బాధితులు...

 *మా గోడు వినిపించుకోండి అంటున్న వరద బాధితులు...*

*బూర్గంపహాడ్ మండల అఖిలపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు  స్థానిక నివాసులుగా విన్నపము...*


CK న్యూస్ ప్రతినిధి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

బూర్గంపహాడ్ మండల కేంద్రంగా గత వారంరోజులుగా నిర్విరామంగా ముంపు ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా రిలే నిరాహారదీక్షలు చేపడుతున్న విషయం మనకందరికీ విధితమే.


ఈ సమస్య ఒక వ్యక్తిదా ఓ కుటుంబానిదా ఒక ఊరిదా

లేక మన మండల ప్రజలందరిదా అనేది మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి.


మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం జిల్లా నుండి రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళొచ్చే మీకు స్థానికంగా మీకు ఓట్లెస్తున్న ప్రజలుపడే బాధలు కష్టాలు నష్టాలు మీకంటికి కనపడటం లేదా ప్రజాప్రతినిధులారా.?


మీ ఉనికి కోసం మీ ఎదుగుదల కోసం అహర్నిశలు మీ వెనకాలే తీరిగే ఇదే ప్రజలు పడుతున్న బాధలను భరించలేక ఒక వ్యవస్థగా ఏర్పడి దీక్షలు చేపడుతుంటే మీ మద్దతు ఎటుపోయింది పార్టీల నాయకులారా.?


ఓట్లప్పుడు ప్రజలు కావాలి మీ ఉనికి కాపాడుకోవడానికి ప్రజలు కావాలి ఆఖరికి మీకోసం జెండాలు అజెండాలు వదిలేసి త్యాగాలు చేయడానికి ప్రజలు కావాలి

కానీ ప్రజల అవసరాలలో వారి సమస్యలలో మీరెక్కడున్నారు పెద్దలారా.?


కేవలం మీ రాజకీయ భవిష్యత్ ఉనికికోసమే పాటుపడతారా

లేక ప్రజల ఇబ్బందులు సమస్యల సాధనకోసం కృషి చేస్తారా.?


ఓట్లకోసం సంధుగొందుల్లో రేయింబవళ్లు తిరిగే మీకు మండల ప్రధానకూడలిలో చేసే ప్రజాదీక్ష కనిపించడం లేదా.?


ఇక్కడ మీ రాజకీయ ఉనికికోసం జిల్లా రాష్ట్ర స్థాయి నేతలను తీసుకొచ్చిమరీ హడావుడి కార్యక్రమాలు చేసే మీరు

స్థానిక మన మండల ప్రజలకోసం మీకు ఓట్లేసిన మీ ప్రజలకోసం ఆ నేతలను తీసుకొచ్చి సంఘీభావం ప్రకటింపచేయలేరా.?

నాయకులొస్తున్నారంటే 100 కార్లు పెట్టి 1000 లాదిగా కదిలే మీరు కనీసం ఒక్క కారులోనైన వచ్చి  ప్రజలకు మద్దతు ప్రకటించలేరా.?

రాజకీయ కార్యక్రమాల్లో చప్పట్లు కొట్టేలా వహ్వా అనేలా ఉపన్యాసలిచ్చే మీరు స్థానిక మండల ప్రజల దీక్షకి తోడ్పాటునిస్తూ ప్రజలకోసం ప్రజల సమస్యకోసం ఒక మాటనైనా పలకలేరా.?

అంతర్గత పార్టీల సమస్యను పార్టీ లోటుపాట్లను రాష్ట్రం రాజధాని వరకు చేరవేసేలా ప్రయత్నించే మీరు మన మండల సమస్యను ప్రజల సమస్యను కనీసం జిల్లా వరకైనా చేర్చలేరా నాయకులుగా.?

ఇవన్నీ అధికార పార్టీనో లేక ప్రతిపక్షాలనో కాకుండా స్థానిక మండల పార్టీల ప్రజా ప్రతినిధులందరిని బూర్గంపహాడ్ మండల స్థానికులగా పౌరులుగా రాజ్యాంగం కల్పించిన హక్కులలో భాగంగా అడుగుతూ విన్నవిస్తున్నాం.

ప్రశ్నించు పొరాడు సాధించు అనే అంబేద్కర్ ఆశయసాధనకు అనుగుణంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుగా ప్రజాగళంగా డిమాండ్ చేస్తున్నాం.

*దయచేసి పాత్రికేయ పెద్దలు మిత్రులు సోదరులకి ఒకటే మనవి...*

మీ పత్రికా సంస్థ కోసం నిత్యం ప్రజాసమస్యలపై ప్రజాకోణంలో ప్రపంచానికి చాటిచెప్పే అనేక విషయాలపై దృష్టి సారించినట్టే

మన మండలం మన ప్రజలు మన సమస్య సాధనకై కృషి చెయ్యమని మనవి చేసుకుంటున్నాము.

కాస్త ఎక్కువ సమయం వెచ్చించి ప్రజల్లో చైతన్యం కలిగేలా ప్రజల సమస్యను ప్రభుత్వాలకు అధికారులకు అద్దంపట్టేలా మీడియా ధోరణిలో సమస్యకు ఓ పరిష్కారం దక్కేలా ప్రజలవాంఛ నెరవేరేలా మీ తోడ్పాటునందించగలరని విన్నవించుకుంటున్నాము.

మా సమస్యను త్వరగా పరిష్కరించాలని వరద బాధితులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

Comments