కింద పడేసి కుమ్మేసిన గేదె.. కారు కిందకు వెళ్లిన కూడా వదల్లేదు..

కొన్నిసార్లు మూగ జీవాలు రోడ్లపైకి వస్తుంటాయి. ఈ క్రమంలో.. అవి రన్నింగ్ లో ఉన్న వాహానాలకు అడ్డుగా వస్తుంటాయి. కొన్నిసార్లు.. అవి వెహికిల్ కింద పడి గాయపడుతుంటాయి.


మరికొన్నిసార్లు.. వేగంగా వచ్చిన వెహికిల్స్ ఢీకొనడం వలన జంతువులు చనిపోతుంటాయి. దారితప్పి.. రోడ్లపైకి వచ్చిన పశువులు.. వాహనాల నుంచి వచ్చే హరన్ శబ్దాలకు బెదిరిపోతుంటాయి. భయపడి.. అటూ ఇటూ పరిగెడుతుంటాయి. అలాంటి సమయంలో.. కొన్నిసార్లు.. అవిఎదురుగా ఉన్న వారి మీద.. వాహనాల మీద దాడులు చేస్తుంటాయి. ఈ కోవకు చెందిన క్లిప్పింగ్ లు వైరల్ గా మారాయి.

read also వ్యాపారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌..ఈ స్కీమ్‌ కింద రూ.50 లక్షల రుణం..

పూర్తి వివరాలు.. గేదె (Buffalo attacks) తన మానాన తాను వెళ్తుంది. ఇంతలో.. రోడ్డుపైన వెహికిల్ పై వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి హరన్ మోగించారు. దీంతో అది భయపడిపోయింది. కోపంతో అతి సదరు వ్యక్తిని కుమ్మడం ప్రారంభించింది. గేదె దాడి నుంచి తప్పించుకొవడానికి అతను రోడ్డుమీద పరుగులు పెట్టాడు. ఇంతలో అతనికి రోడ్డు పక్కన ఒక కారు పార్కు చేసి ఉండటాన్ని గమనించాడు.

వెంటనే దానికిందకు వెళ్లి దాక్కున్నాడు. గేదె మాత్రం.. కారు కిందకు వెళ్లిన అతడిని వదల్లేదు. అతని కోసం అక్కడే వేచిచూసింది. ఎంత సేపటికి రాకపోవడంతో మెల్లగా గేదె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతను కూడా.. గేదె వెళ్లిపోయింది కన్ఫామ్ చేసుకుని.. మెల్లగా బయటకు వచ్చి.. వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ లు వైరల్ గా (Viral news) మారాయి.

ఇదిలా ఉండగా ట్రాఫిక్ పోలీసు రోడ్డుమీద రెచ్చిపోయాడు.

పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana) ఒక ట్రాఫిక్ పోలీసు (Traffic police) నడిరోడ్డుమీద కంట్రోల్ తప్పాడు. ఫరీదాబాద్ లోని బాటా చౌక్ సమీపంలో.. టూవీలర్ మీద ముగ్గురు యువకులు డ్రైవింగ్ చేసుకుంటూ రాంగ్ రూట్ లో రోడ్డు మీదకు వచ్చారు. వీరిని అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే కోపంతో.. అక్కడ ఉన్న ఒక గొడ్డలి తీసుకున్నాడు. నరుకుతా.. అంటూ వారి మీదకు వెళ్లాడు.

అంతటితో ఆగకుండా.. కాలితో తంతూ ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించాడు. ట్రాఫిక్ పోలీసును చూసి అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. మరో ప్రయాణికుడు తన మోబైల్ లో ఈ ఘటన రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త గా మారింది. ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.

Comments