సీకే న్యూస్ కథనానికి స్పందన

 సీకే న్యూస్ కథనానికి స్పందన

చిమ్మ చీకటి లోనే నివసిస్తున్న లక్ష్మాపూర్ గ్రామస్తులు...

అనే కథనానికి స్పందించి అధికారులు సమస్యను పరిష్కరించారు....!


సి కే న్యూస్ జుక్కల్ ప్రతినిధి ఆగస్టు 27

 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో గత వారం రోజుల నుంచి విద్యుత్ స్తంభాలకు లైట్లు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మారేపల్లి గ్రమ పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధిత మండల అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లక్ష్మాపూర్ గ్రామస్తులు వారం రోజుల పాటు గా చిమ్మ చీకటి లోనే నివసిస్తున్నారు గ్రామ పంచాయతీ అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా వెంటనే మండల అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇట్టి సమస్యపై అధికారులు శనివారం వీధి దీపాలు యధావిధిగా సరి చేయడం జరిగిందని తెలిపారు.

Comments