ఓకే కుటుంబానికి చెందిన నలుగురి అత్మహత్య...!
- భాగ్యస్వాముల ఒత్తిడి వల్లేనా...?
- నిజామాబాద్ కపిల హోటల్ లో ఘటన
సీకే న్యూస్ నిజామాబాద్
నిజామాబాద్ నగరంలోని హైద్రాబాద్ రోడ్ లోని కపిల హోటల్ లో ఓకే కుటుంబానికి నలుగురు అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన అదివారం అలస్యంగా వెలుగు చూసింది. మృతులను అదిలాబాద్ జిల్లా కు చెందిన వారని హైద్రాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. మృతులను సూర్య ప్రకాష్ (37) అతని భార్య అక్షయ ( 36), వారి పిల్లలు ప్రత్యూష (13), అద్వైత్ ( 10) అని తెలిసింది. సూర్య ప్రకాష్ ఉరివేసుకుని అత్మహత్య చేసుకోగా అతని భార్య, ఇద్ధరు పిల్లలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సూర్య ప్రకాష్ వ్యాపార నిమిత్తం హైద్రాబాద్ లో సెటిల్ అయిన కుటుంబానికి నిజామాబాద్ లో సైతం బంధువులు ఉన్నట్లు తెలిసింది. శనివారం హోటల్ గదిలో బస చేసిన కుటుంబం అదివారం మద్యహ్నం అయిన తలుపులు తీయకపోవడంతో హోటల్ మేనేజ్ మెంట్ స్థానిక పోలిస్ లకు సమాచారం అందించారు. వారు వచ్చి వేరే తాళంతో హోటల్ గదిని తెరువడంతో ఈ అఘాయిత్యం బహిర్గతం అయింది. నాల్గవ టౌన్ ఎస్ఐ సందిప్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఓకే కుటుంబం అత్యహత్యకు గల రియల్ ఎస్టేట్లో భాగ్యస్వములైన వారి ఒత్తిడిలో ఒత్తిడిల మేరక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ఒకవైపు పెరిగిన అప్పులు, మరోవైపు భాగ్యస్వాముల ఒత్తిళ్ల వల్ల సూర్య ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది.వారి ఆత్మహత్య చేసుకోక ముందు తన మరణము కు గల కారణాలను ఒక లేఖలో రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు ఘటన స్థలం వద్ధ లేఖ సైతం లభ్యమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Comments
Post a Comment