భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్పీ కార్
మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గోదావరి నది ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :
ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్
CK NEWS భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
16 ఆగస్టు 2022
16 ఆగస్టు 2022 రాత్రి గోదావరి 53.20 ఫీట్లకు చేరుకుంది దీంతో అప్రమత్తంగా ఉండాలని మన జిల్లా కలెక్టర్ మరియు మన ఎస్పీ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
*అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందాలి.24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలీసు అధికారులకు ఆదేశాలు*
*పోలీసు వారి సూచనలు పాటించాలని మనవి*
భద్రాచలం వద్ద గోదావరి మరలా ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న కారణంగా పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపిఎస్ విజ్ఞప్తి చేశారు.ఈ రోజు రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు చేరుకోవచ్చని ఇప్పటికే CWC రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు.దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి,ఎం.కాశీనగరం,గంగోలు చర్ల మండలంలోని దండుపేట కాలనీ,వీరాపురం,పెద్దిపల్లి ఆశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర,రామచంద్రాపురం,బట్ట మల్లయ్య గుంపు,కుమ్మరిగూడెం కింది గుంపు,టేకులగుట్ట మణుగూరు మండలంలోని చిన్నరాయిగూడెం,కమలాపురం,అన్నారం గ్రామాల ప్రజలు పోలీసు వారి సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మత్స్యకారులు ఈ సమయంలో నదులలో,చెరువులలో వేటకు వెళ్ళొద్దని కోరారు.నదులు,వాగులు,వంకలను చూడటానికి ప్రజలు,ప్రజా ప్రతినిధులు,పిల్లలు ఎవ్వరూ కూడా రావద్దని విజ్ఞప్తి చేశారు. చర్ల,దుమ్ముగూడెం వెళ్లే రహదారులు జలదిగ్బంధం అవుతున్నాయని వెల్లడించారు.ప్రజలంతా పోలీసువారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Date:- *16-08-2022*
Time :- *9.00PM*
Godavari water level at BCM :- *53.20ft*
Discharge :- *14,36,573 Cusecs*
*3rd Warning (53.00 ft) is in force*
Comments
Post a Comment