అక్రమ విద్యుత్తు ఇటుక బట్టిల మాఫియా....!
- ఫ్రీ కరెంట్ తో ఇటుక బట్టీల నిర్వాహకం
- పర్మిషన్ కొంచమే వాడుకునేది అపరిమితం...
- ప్రభుత్వ నిబంధనలు తుంగలో...
సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటుక బట్టీ మాఫియా జడలు విప్పింది. పరిమిషన్ కొంచమే వాడుకునేది అపరిమితం, అంతా ఇంత కాదు ఇటుక బట్టీల వ్యాపారం అక్రమాల పుట్టగా మారింది. అరికట్టాల్సిన అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. పట్టణానికి నలుమూలల నిర్మాణ రంగం ఊపందుకోవడంతో నగర శివారుల్లో వేల సంఖ్యలో ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణాల ప్రాంతానికి అనుకూలంగా ప్రతి మండల శివార్లలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నరు.
మామూలుగా మారుమూల ప్రాంతాలలో లెక్కకు మించి ఉన్న బట్టీలే దాదాపు సుమారుగా 500 ఎకరాలకు పైచిలుకు విస్తీర్ణంలో ఉన్నట్లుగా సమాచారం. ఎలాంటి అనుమతుల్లేకుండానే ప్రధాన రహదారుల పక్కనే బట్టీలను నిర్వహిస్తున్నారు.బట్టీల నుంచి వస్తున్న పొగ, ధూళితో వాహనదారులు ఇబ్బంది పడటమే కాదు..! అనేక సార్లు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. బట్టీలకు సమీపంలోని ఉన్న పొలాలన్నీ ధూళితో నిండిపోతుండటంతో పంటలన్నీ,నాశనమవుతున్నాయి. రైతుల నుంచి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.బట్టీలను ఏర్పాటు చేయాలంటే పట్టా భూములను నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్) కన్వర్షన్ చేసుకున్న భూముల్లో మాత్రమే చేయాల్సి ఉంది. అయితే రెండు పంటలు పండుతున్న భూముల యొక్క రైతుల నుండి భూములను లీజు పేరిట చేతుల్లోకి తీసుకుంటున్న వ్యాపారులు పంట పొలాల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. దాంతోపాటు బట్టీలకు సమీపంలోని చెరువులు, కుంటల నుంచి కూడా పెద్ద ఎత్తున రాగడి మట్టిని బట్టీలకు తరలిస్తూ ఇటుకల తయారీకి వినియోగిస్తుండటం గమనార్హం. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్క కామారెడ్డి జిల్లాలో పలు నియోజకవర్గాలలో కూడా ఇలాంటి సమస్యలే వెల్లువెత్తుతున్నాయి. అనడంలో సందేహం లేదు..? వందల సంఖ్యలో ఉన్న ఇటుక బట్టీల్లో కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాత్రం రాకుండా పోతుండటం గమనార్హం. ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న వారిలో అత్యధికులు ప్రజా ప్రతినిధులు, వారి బినామీ తొత్తులు, గా చలామని అవుతున్న వారు ఎక్కువ అని చెప్పవచ్చు. వారు చెప్పిందే లెక్క వారు మాట్లాడింది వేదం అనే రీతిలో ఇటుక దందా, కొనసాగించడం వారికి అడ్డు అదుపు అనేది ఉండదు. ఓ రకంగా రాజకీయాల అండదండలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవడం విశేషం.ఇక కార్మికులుగా చత్తీస్‌గడ్, కర్ణాటక, వీటితోపాటు సుదీర్ఘ ప్రాంతాలకు చెందిన వారు అత్యధికులుగా ఉన్నారు.ప్రభుత్వం వ్యవసాయం కోసం 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తుంటే,ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించే వారు మాత్రం ఉచిత విద్యు్త్ ను తమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. ఇటుక బట్టీ నిర్వహణకు నీరు అధికంగా అసవరం ఉంటుంది. పట్టా భూముల్లో ఉండే వ్యవసాయ బోరుబావుల నుంచి పైపులు వేసుకొని ఉచిత విద్యుత్ ను వాడుకుంటున్నారు.మరికొన్ని చోట్ల కొందరు వ్యాపారులు జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు.జిల్లాలోని ఇటుకబట్టీల వద్ద ఉచిత విద్యుత్ చౌర్యం జరుగుతున్నా విద్యుత్తుశాఖ అధికారులు అటువైపు కూడా చూడటం లేదు. బిల్లులు చెల్లించని రైతుల మోటార్ల కనెక్షన్లు తొలగించే అధికారులు, విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే పరిశ్రమలశాఖ,మైనింగ్, రెవెన్యూ,కార్మికశాఖ, రవాణశాఖ,విద్యుత్తుశాఖ, తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పట్టణ శివారుల్లో ఏర్పాటు చేస్తున్న బట్టీల్లో ఇవేవీ కనిపించవు. పట్టాభూముల్లో ఏర్పాటు చేయటమే కాకుండా స్థానికంగా అందుబాటులో ఉండే వనరులన్నీ ఉపయోగించుకుంటున్నారు. ఏళ్లుగా అక్రమంగా ఇటుక బట్టీల వ్యాపారం కొనసాగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు మామూలుగా వదిలేస్తున్నారు. వీటిల్లో ఏ ఒక్క అనుమతి లేకున్నా సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవటంతోపాటు, బట్టీలను సీజ్ చేసే అధికారం మండల రెవెన్యూ అధికారుల కు ఉన్నా ఇప్పటివరకు ఒక్క బట్టీపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా బహిరంగంగా వ్యాపారం కొనసాగుతున్నా అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శల వెల్లువ...!
Comments
Post a Comment