అనాధ పిల్లలకు దసరా పండుగ కి కొత్త బట్టలు పంపిణీ

అనాధ పిల్లలకు దసరా పండుగ కి కొత్త బట్టలు పంపిణీ చేసిన అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు కే బ్రహ్మం....... 

సి కె న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా....


   ఈ సందర్భంగా బ్రహ్మం మాట్లాడుతూ తల్లిదండ్రులు కోల్పోయిన 18 సంవత్సరాల లోపు పిల్లలను ప్రతి ఒక్కరూ తమ వంతు చేయూతను అందించాలని కోరారు. అందరికీ రాష్ట్రవ్యాప్తంగా చీరలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అనాధ పిల్లలకు మాత్రం ఇవ్వకపోవడం చాలా అన్యాయం.  

ప్రభుత్వానికి వీరు కనిపించడం లేదా? ప్రతి జిల్లాలో సుమారు వందల సంఖ్యలో అనాధ పిల్లలు  ఉన్న కూడా కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అనాధ పిల్లల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ప్రత్యేక భవనం నిర్మిస్తామని, చెప్పి మర్చిపోయింది. అనాధ పిల్లల కోసం ప్రభుత్వం నిధుల కేటాయింపులో చిన్నచూపు చూస్తుంది. 

ఎందుకంటే వీరికి ఓట్లు లేవు కనుక, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వీరిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీరి కోసం చేతనైన అండదండలు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో  పిల్లలు మల్లేష్ ,కుమార్, లక్ష్మి మహేష్ ,చింటూ, బేతమ్మ, రజిత దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments