భద్రాచలంలో మోటార్ సైకిళ్ల ఘరానా దొంగల అరెస్టు
అరెస్ట్ వివరాలను వెల్లడించిన భద్రాచలం ఎస్పి రోహిత్ రాజ్, ఐపీఎస్
CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
అతను ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి, వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోవట్లేదని మోటార్ సైకిల్ లను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ & ప్రైవేటు హాస్పిటల్, ఇండ్ల ముందు డిప్లికేట్ తాళం తో సుమారు 15 మోటార్ సైకిళ్లను రాత్రి వేళలో దొంగతనం చేసి, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటించాడు, ఆ డబ్బులతో జల్సా జీవితం మొదలుపెట్టాడు. చివరకు భద్రాచలం పోలీసు వారికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే. ప్రైవేటు ఉద్యోగం చేసే దేవరపల్లి గ్రామం చెర్ల మండలానికి చెందిన కారం కృష్ణమూర్తి భద్రాచలం పట్టణంలో మోటార్ సైకిల్ లను రాత్రి వేళలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. పోలీసు వారు తనదైన శైలిలో విచారిస్తే మొత్తం 15 మోటార్ సైకిల్ ల వరకు దొంగిలించి, కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలానికి చెందిన కేదాసీ రాముకు తక్కువ ధరలకు అమ్మినట్లుగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసు వారు 12 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు, మూడు మోటార్ సైకిల్ లను గుర్తించాల్సి ఉంది. ఇట్టి కార్యక్రమంలో భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సై మధు ప్రసాద్ పాల్గొన్నారు. మోటార్ సైకిల్ లో దొంగను పట్టుకొనడంలో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుళ్లు సూర్యం శంకర్ లు కానిస్టేబుళ్లు శంకర్ లక్ష్మణ్& రామారావు లను ఎఎస్పీ భద్రాచలం అభినందించారు.
Comments
Post a Comment