వైద్యులు లేని స్కానింగ్ సెంటర్ సీజ్

 *భద్రాచలంలో స్కానింగ్ సెంటర్ సీజ్...*



*వైద్యులు లేకుండా ఆసుపత్రి సిబ్బందితో నడిపిస్తున్నారని...* 


CK న్యూస్ ప్రతినిధి 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాచలం పట్టణంలోని శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోంలో ఉన్న స్కానింగ్ సెంటరును డీఎంహెచ్ఓ డాక్టర్ కె దయానంద స్వామి ఆదేశాల మేరకు శుక్రవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కె రాజ్ కుమార్ సమక్షంలో మూసివేయించి సీజ్ చేశారు.


 స్కానింగ్ సెంటర్ నిర్వహణ సమయంలో ఉండాల్సిన వైద్యులు లేకుండా ఆస్పత్రి సిబ్బందితో స్కానింగ్ నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి మూసి వేయించినట్లు అధికారులు తెలిపారు.


 నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహె చ్ హెచ్చరించారు. 


ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఓ ఎండి ఫైజ్ మొయిద్దీన్ వైద్యాధికారి డా చైతన్య డీఎస్ఓ ఇనాక్ హెల్త్ ఎడ్యుకేటర్ టి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు...

Comments