అన్నా దమ్ముల్లా ఉన్నాం ఆలోచించండి

 *అన్నా దమ్ముల్లా ఉన్నాం ఆలోచించండి...*


*దళిత బంధు పథకం పై పిటిషన్ బాధాకరం...*


*ఎందరో నిరుపేద దళితులకు అన్యాయం...*


*ఆదివాసీ సంఘాలకు గద్దల నాగేశ్వరరావు మనవి...*



CK న్యూస్ ప్రతినిధి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం

ఎన్నో ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో దళిత గిరిజనులు అన్నా దమ్ముల్లాగా కలిసి మెలిసి జీవిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పధకం పై కొన్ని గిరిజన సంఘాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దళిత సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని.


 మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు అన్నారు మంగళవారం నాడు అశ్వాపురం మండల కేంద్రంలో  మాట్లాడుతూ.


దళిత సామాజిక వర్గం ఆర్ధికంగా సామాజికంగా వెనుకబాటుకు గురౌతున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని కూలీ నాలి పనులు చేసుకుంటూ ఎందరో నిరుపేద దళితులు జీవనం సాగిస్తున్నారు.


ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పధకం ద్వారా కొందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని అనుకున్న తరుణంలో కొన్ని గిరిజన సంఘాలు దళిత బంధు పథకంపై కోర్టును ఆశ్రయించడం చాలా బాధాకరమని అన్నారు.


ఎన్నో అవమానాలు బరిస్తున్న దళిత కుటుంబాల పట్ల సోదర సమానులైన గిరిజన సంఘాలు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలకు మోకాలడ్డటం శోచనీయమన్నారు.


ఏజెన్సీ చట్టాలను మేము ఏనాడు వ్యతిరేకరించలేదని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా గిరిజన సంఘాలు,ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి హక్కులను అడ్డుకోవడం సరైనది కాదని రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఇప్పటికే వెనుకబడి ఉన్నాయని  వారికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను పెద్దమనుసుతో ఆలోచించి సహకరించాలని కోరారు...

Comments