*బి ఎస్ ఎస్ ఎం ఆధ్వర్యంలో గుండాల ఎమ్మార్వో కి వినతి పత్రం...*
CK న్యూస్ ప్రతినిధి
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని భారతీయ సర్వ సమాజ్ మహా సంఘ్ అధ్వర్యంలో 600 మందితో శాంతియుత ర్యాలీ అనంతరం ఎమ్మార్వో కి వినతి పత్రం BSSM టీమ్.
భారతీయ సర్వ సమాజ్ మహా సంఘ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చింతా నరసింహారావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వర్శ వెంకన్న, జిల్లా మహిళ అధ్యక్షురాలు ఈసం నాగలక్ష్మి ఆధ్వర్యంలో గుండాల మండలంలోని సుమారు 600 మంది గిరిజన బహుజనులు ప్రజా సమస్యలపై ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కి మెమొరాండం అందించడం జరిగింది.
ఎమ్మార్వో స్పందంచి BSSM తరపున ఇచ్చిన లెటర్ నీ కలెక్టర్ కి పంపిస్తామని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అదే విధంగా మహిళ కార్యకర్తలపై దాడులు అసభ్యకరంగా మాట్లాడటం అడ్డిగించే వారిపై గుండాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతా నరసింహారావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వర్శ వెంకన్న ఇల్లందు మండల అధ్యక్షులు ఈసం రవి జిల్లా కార్యదర్శి యట్టి శ్రీరాములు ఆల్లపల్లి మండల అధ్యక్షులు కొమరం హరి జూలూరుపాడు మండల అధ్యక్షులు భూక్యా రవి జిల్లా మహిళ నాయకులు లకావత్ లలిత దారవత్ లక్ష్మి, బొర్రా నాగమణి టేకులపల్లి మహిళ మండలి అధ్యక్షురాలు ఊకె భవాని లక్ష్మీదేవిపల్లి మహిళ మండలి అధ్యక్షురాలు మాలోత్ మాంగినీ బయ్యారం మండల అధ్యక్షులు సుర్ణపాక రామ్ దొర గూడూరు మండల అధ్యక్షులు కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు...
Comments
Post a Comment