*బహుళ అంతస్తుల నిర్మాణంలో నాట్ ఫర్ రీసెల్ సిమెంటు వాడకం...?*
*స్థానిక మండల అధికారులకు సమాచారం ఇచ్చిన మాకు సంబంధం లేదు అంటున్న వైనం...?*
*సిమెంట్ కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి...?*
*వీటికి సంబంధించిన అధికారులు ఎవరు...?*
CK న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక లో గతంలో ఉన్నటువంటి లారీ యార్డు పక్కన నిర్మిస్తున్నటువంటి అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రభుత్వ పనులకు ఉపయోగించాల్సిన సిమెంట్ కట్టలను కొందరు బడా బాబులు వారు సొంతంగా నిర్మించుకునే అంతస్తులకు నాట్ ఫర్ రీసెల్ సిమెంట్ కట్టలను ఉపయోగిస్తూ భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ఈ విషయమై పలువురు అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందించకపోవడం విశేషం...?
ఇటువంటి అక్రమ కట్టడాలు కడుతున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా వారు నాట్ ఫర్ రీసెల్ సిమెంట్ కట్టలు బహుళ అంతస్తులకు వాడుతున్న పట్టించుకోకుండా ఇటువంటి కట్టడాలపై ఏమాత్రం స్పందించకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు తీరు ప్రశ్నార్ధకంగా మారింది...?
ఈ కట్టడాలపై ఏ అధికారి స్పందించి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే...?
ఈ అక్రమ కట్టడంపై నాట్ ఫర్ రీసెల్ సిమెంట్ కట్టలపై ఏ అధికారి స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది అనుకుంటున్న మండల ప్రజలు.
జిల్లాస్థాయి అధికారులైన స్పందించి అక్రమ కట్టడాలపై నాట్ ఫర్ రీసెల్ సిమెంటు కట్టలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న మండల ప్రజలు...
Comments
Post a Comment