ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేసిన వ్యాపారస్తులు...

 ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేసిన వ్యాపారస్తులు...

వ్యాపారస్తులకు అండగా ఉంటా....

ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ....సహించేది లేదు

- ఎమ్మెల్యే పొదెం వీరయ్య

CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి

26 సెప్టెంబర్ 2022


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం ఇటీవల జిల్లా కలెక్టర్ తో పాటు  ఉన్నత అధికారులు కొత్త మార్కెట్లో స్థలం కోసం ప్రస్తుతం ఉంటున్న వ్యాపారస్తులను ఖాళీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే .... దీంతో స్థానిక వ్యాపారస్తులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ...  ఎమ్మెల్యే వీరయ్య ను కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు..... ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోదాం వీరయ్య మాట్లాడుతూ.. తన సొంత నియోజకవర్గంలో తనకు సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన అధికారులు వచ్చి వ్యాపారస్తులను ఖాళీ చేయమనడం సరైన పద్ధతి కాదన్నారు... గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు... అధికారులు ఇప్పుడొచ్చి బెదిరించడం ఏంటని ప్రశ్నించారు... తన నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు....  స్థానిక ఎమ్మెల్యేగా తాను ఈ విషయాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు... వ్యాపార సంఘ నాయకులందరికీ తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు...ఈ  సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు... ఈ కార్యక్రమంలో కొత్త మార్కెట్ వ్యాపారస్తులు, మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సరెళ్ళ నరేష్ , బోగల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రంగా,  యూత్ నాయకులు సరెళ్ళ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.....

Comments