పోడు భూముల దరఖాస్తుల పరిశీలన

 పోడు భూముల దరఖాస్తుల పరిశీలన


- కలెక్టర్ జితేష్ వి పాటిల్


సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి



పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనుల దరఖాస్తులను ఈనెల 28 నుంచి  పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అక్టోబర్ 28 లోగో పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో 6 నుంచి 8 బృందాలను ఏర్పాటు చేసి పోడు భూముల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. అర్హత గల వారికి న్యాయం చేయాలని పేర్కొన్నారు. అడవులను రక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని తెలిపారు. అడవులను నరికే వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఆర్ ఎఫ్ ఆర్ చట్టం ప్రకారం అర్హత గల లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఒక బృందం రోజుకు 15 నుంచి 20 ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రెవెన్యూ అదనపు  కలెక్టర్ చంద్రమోహన్, డిఎఫ్ఓ నిఖిత, డిఆర్డిఓ సాయన్న, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments