భారీగా రేషన్ బియ్యం పట్టుకున్న అధికారులు...

 *భారీగా రేషన్ బియ్యం పట్టుకున్న అధికారులు...* 


CK న్యూస్ ప్రతినిధి



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట

గడిచిన మూడు రోజుల్లో అక్రమంగా తరలుతున్న 1250 క్వింటాళ్ళు పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పోలీసులు విజిలెన్స్ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. 


ఈ 1250క్వింటాలు బియ్యం ఉమ్మడి నల్గొండ కరీంనగర్, జిల్లాల నుండి ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి కాకినాడకు యధేచ్చగా తరలిస్తున్నారు.


 అశ్వారావుపేట తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాకు దిక్చూచిగా మారింది.


 ఈ నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో నాలుగు లారీల్లో ఒక డీసీఎం వాహనంలో సుమారు 1250 క్వింటాల మేరా అంటే 125 టన్నులు రేషన్ బియ్యాన్ని పోలీసులు విజిలెన్స్ అధికారులు సంయుక్త దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు.


ఈ దాడుల్లో దొరికిన 5 లారీలు ఉమ్మడి నల్గొండ కరీంనగర్ జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ రాజమండ్రికి తరలిస్తున్నట్లు తెలుస్తోది. అక్రమంగా తరలిస్తున్న బియ్యం యజమానులు మేము బియ్యం వేలం ద్వారా తీసుకున్నామని కొంతమంది చెబితే కొంతమంది ఎఫ్సీఐ రిజెక్ట్ చేసిన బియ్యం కాబట్టి మేము పోర్టుకు తరలిస్తున్నారని మరి కొంతమంది చెప్తున్నారు.


 అయితే ఎవరు ఏది చెప్పినా సరైన పత్రాలు చూపించక పోవడంతో దొరికిన 5 లారీలను అశ్వారావుపేట పోలీస్ స్టేషనుకు తరలించారు. 


స్టేషన్ ప్రాంగణంలో సరిపడా స్థలం లేకపోవడంతో ఈ లారీలను బస్ స్టేషన్ ఆవరణలో నిలిపారు. ఇప్పటికైనా సరిహద్దు ప్రాంతంలో విజిలెన్స్, పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని అక్రమ రవాణా అడ్డు కట్టా వేయాలని పలువురు కోరుతున్నారు.


కేవలం దొరికినవి అయిదు లారీలైతే దొరక్కుండా అర్ధరాత్రి సమయంలో కొన్ని వేల టన్నులు పీడీఎస్ బియ్యం తరలిపోతున్నాయంటూ  ఆరోపణలు ఉన్నాయి. 


ఈ అక్రమ రవాణాలో ఎవరి పాత్ర ఎంతో? ఎవరి సహాకారంతో? అన్నది ఉన్నతాధికారులూ తేల్చనున్నారు.


ఈ విషయమై ఎస్ఐ అరుణను సంప్రదించగా స్పందించలేదు. సివిల్ సప్లై డిటి వెంకటేష్ ను సంప్రదించగా విచరిస్తున్నామని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు...

Comments