ఉప్పల్ వాయి నుండి షిరిడీకి రైలు ప్రయాణం
సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్ వాయి గ్రామంలోని రైల్వె స్టేషన్ లో ఉప్పల్వాయి నుండి షిరిడీకి ఉదయం 8 గంటలకు కాచిగూడ నుండి రోటెగావ్ వెళ్లే రైలు ఉప్పల్ వాయి స్టేషన్ లో ఆగుతున్న సందర్బంగా గ్రామ, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు సోమవారం రోజు రైలు బండికి పూజ చేసి పంపించడం జరిగింది. ఈ సందర్బంగా స్థానిక చుట్టుపక్కల ప్రజలు మాట్లాడుతు ఈ రైలు ఉప్పల్ వాయి స్టేషన్ లో ఆగడం ద్వారా మాకు కామారెడ్డి వెళ్లే ఇబంది తప్పింది అని గతంలో రైల్వె డి.ఆర్.ఎం కు వినతి పత్రం ఇవ్వగానే వెంటనే స్పందించి ఉదయం, మద్యానం, సాయంత్రం, రాత్రి పుటలలో తప్పకుండ ప్రతి రైలు ఉప్పల్ వాయిలో ఆపుతున్నందుకు రైల్వె డి.ఆర్.ఎం, అధికారులకు, గ్రామ,చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరుపున ధన్యవాదములు తెలుపుతున్నాం అని అన్నారు.అనంతరం రైల్వె స్టేషన్ ఎస్.టీ.బి.ఏ సంకి రతన్ కుమార్ మాట్లాడుతూ ఉప్పల్ వాయి గ్రామ ప్రజలు చాల కష్ట పడి ఈ రైళ్లను ఆపడానికి కృషి చేసారని అన్నారు. రైళ్లను ఆపుకోవడమే కాదు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టిక్కెటు తప్పకుండ తీసుకోవాలని కోరారు.ఆలాగే కామారెడ్డి వైపు రోజు వెళ్లే వారికీ ఒక్క నెల పాస్ కేవలం 100 రూపాయలు ఆలాగే నిజామాబాద్ వైపు రోజు వెళ్లే వారికీ ఒక్క నెల పాస్ కేవలం 185 రూపాయలు మాత్రమే దీనిని గమనించి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోని రైళ్ల సమాచారం కోసం 9440784892 కు సంప్రదిచగలరు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సరస్వతి, గ్రామ అధ్యక్షులు పల్లె నర్సింలు, స్టేషన్ మాస్టర్లు చక్రవర్తి,రాజేష్,ఆకుల లింగం, గురిజాల సాయిరెడ్డి,ఆలా పర్వారెడ్డి, కాల శ్రీనివాస్, ఎన్నం రాములు, సంకి లింగం, కుమ్మరి ఎల్లయ్య, గిద్ద వెంకన్న, పోసానిపేట్ గాండ్ల సాయిలు, గోకులతండా శంకర్ నాయక్, ఆలా సంతోష్, ఆకుల సురేష్,కుమ్మరి సాయి కృష్ణా,కుమ్మరి ఎల్లయ్య, వివిధ గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Post a Comment