నూతన ఆసరా పెన్షన్ పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే

 నూతన ఆసరా పెన్షన్ పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే

- జాజాల సురేందర్


సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం రోజున లబ్ధిదారులకి నూతన ఆసరా పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన 11 గ్రామాలకు 687 ఆసరా పెన్షన్లు, 14 కల్యాణ లక్ష్మి చెక్కులు,12 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, అందజేశారు.అదే విధంగా ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలు పణంగా పెట్టి 

రాష్ట్ర న్నీ సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని తెలిపారు . అదేవిధంగా ప్రతి బడుగు బలహీన వర్గాలకు కావలిసిన సంక్షేమ పథకాలను అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అభివృద్ధిలో ముందుంటుందని, తాగు నీరు సాగు నీరు అందితే తప్ప రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి రైతులకు 24 గంటల కరంటు నిరు పేదలకు కళ్యాణాలక్మి షాది ముబారక్ రైతులకు రైతు బంధు రైతు బీమా పథకం కేసీఆర్ కిట్టు ,కాళీశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ఇంటింటికి మంచి నీటి సరఫరా మిషన్ కాకతీయ ఇలా ఎన్నో పథకాల భంగానే మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను చేపట్టడంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా అభివృద్ధిలో ముందున్నామని తెలిపారు.

మన రాష్ట్ర సంపద పెంచి నిరుపేదలకు పంచుతున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దీంట్లో భాగంగానే ఆసరా ఫించన్లు అర్హులైన ప్రతి పేదవాడికి 2016 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి మండల ఎంపీపీ దశరత్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవిందర్రావు, గాంధారి ఏఎంసి చైర్మెన్ సత్యం రావు,మండల తెరాస అధ్యక్షుడు రంగు రవిందరగౌడ్, మండల రైతు బంధు అధ్యక్షుడు నారాయణా రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు, జిల్లా రైతు బంధు డైరెక్టర్ కసర్ల రాజేందర్, గ్రామ రైతు కమిటీ అధ్యక్షుడు బండ్ల బాలయ్య, సర్పంచులు దండే బోయిన సంజీవ్, గంగారాం, రాజనర్స్, స్వామిగౌడ్ లావణ్య, మంజుల కిషన్ గౌడ్, బాలమని లింబద్రి, చందర్, మండల తెరాస యూత్ అధ్యక్షుడు దోమకొండ శ్యామ్ రావు, ఎంపీటీసీలు రాజేందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, ఉపసర్పంచ్ పోతునూరి ప్రసాద్, తెరాస నాయకులు, శ్రీనివాస్, రెడ్డి మల్లేష్, మహిపల్, కడెం శ్రీకాంత్, పాల మల్లేష్,తెరాస గ్రామ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రైతులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments