*తెలంగాణ రాష్ట్రం లో సర్పంచ్ లకు ప్రాధాన్యత లేదు*
*సర్పంచ్ ల రక్తం పిలుస్తున్న తెరాస*
*రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతో గ్రామానికి సర్పంచ్ అంత*
*తెరాస ప్రభుత్వం లో వింత పోకడలు...ఎమ్మెల్యే లు సర్పంచ్ లను బెదిరించి ,ఒత్తిడిలు కు గురి చేసి అవినీతికి పాల్పడుతున్నారు*
*హుజూర్ నగర్ నియోజక వర్గం లో ఎమ్మెల్యే సైదిరెడ్డి యల్. ఈ.డి లైట్లు,ట్రాక్టర్లు,బ్లీచింగ్ ఫౌడెర్ కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడ్డారు*
*యం.పి...ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు*
*సి కె న్యూస్ ప్రతినిధి పాలకవీడు*
తెలంగాణ రాష్ట్రం లో గ్రామ సర్పంచ్ లకు అధికార పార్టీి,ప్రతి పక్ష పార్టీ ల ప్రజా ప్రతినిధులకు గౌరవం దక్కడం లేదని మాజీ పి.సి.సి నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.సోమవారం హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో సూర్య పేట జిల్లా లో ఉన్న కాంగ్రెస్ సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు తో తెరాస ప్రభుత్వం నుండి వారు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్య కార్యకర్తల తో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యం.పి ఉత్తమ్ సర్పంచ్ లను ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు సరైన నిధులు విధులు లేక అడుగు అడుగున అవమానాలు భరిస్తూ బిల్లు లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
తెరాస ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అధికార ప్రతి పక్ష సర్పంచ్ ల రక్తాన్ని పీ లుస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు..
పల్లె ప్రగతి లో పనుల చేసిన నెలల తర్బడి బిల్లులు రాక లక్షలాది రూపాయల పెండింగ్ బిల్లులతో సర్పంచులు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెచ్చిన డబ్బులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడు తున్నారనీ ఆరోపించారు.. సర్పంచ్ లను ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నా ఈ తెరాస ప్రభుత్వం కుప్పకూలి పోవడం ఖాయం అని అన్నారు..
హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైది రెడ్డి నియోజక వర్గం లో ఉన్న సర్పంచ్ ల తీర్మానం లేకుండా నే ఎల్ ఈ డి లైట్లు,ట్రాక్టర్లు,చివరికి బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు..కొంత మంది మండల అభివృద్ధి అధికారులు బ్లీచింగ్ ఫౌడర్ లు కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు సరఫరా చేస్తున్నారని వారు గ్రామ పంచాయతీకి సరఫరా చేసే అవసరం ఏమిటి అని ప్రశ్నించారు.
జిల్లా పరిషత్ సమావేశం లో అంత బేష్ అని అధికారులు క్లీన్ చిట్ ఇస్తున్నారని..క్షేత్ర స్థాయిలో సర్పంచ్ లను అడిగితే సమస్యల చిట్ట చెబుతున్నారని అన్నారు..సర్పంచ్ లు కు రావాల్సిన పల్లె ప్రగతి బిల్లులు జడ్పీ సమావేశం లో తాను ప్రశ్నించడం వలనే కొంత నిధులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
హుజూర్ నగర్ మండలం గోపాలపురం సర్పంచ్ కు తెలియకుండా తీర్మానం లేకుండా ముఖ్యమంత్రి ప్రతి గ్రామానికి ఇచ్చిన యస్.డి. యఫ్ నిధులు 20 లక్షల రూపాయల పనులను అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే సైదిరెడ్డి అండ దండల తో దొడ్డి దాటిన పనులు చేపట్టారని తీర్మానం ఇవ్వకుంటే అధికారుల తో బెదిరింపులు కు పాల్పడి గ్రామ పంచాయితీ రికార్డుల్ని జిల్లా అధికారులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎస్ డి ఎఫ్ నిధులకు ఎమ్మెల్యే సైధి రెడ్డికి ఏమి సంబంధం అని ప్రశ్నించారు..సర్పంచ్ లకు ఏ కష్టం వచ్చిన సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఉత్తమన్న మీ వెంటే ఉంటా అని భరోసా ఇచ్చారు..
నడి గూడెం మండల కరివిరాలలో ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్,కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి లు. కలిసి కాంగ్రెస్ మహిళ సర్పంచ్ పై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారనీ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా అని అన్నారు..
ముఖ్యమంత్రి కె సి ఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్న అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని గ్రామాల్లో 12 గంటలు కూడా కరెంటు రావడం లేదన్నారు..
కొన్ని చోట్ల గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించారని వాటికి బిల్లులు చెల్లించక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారన్నారు..అంతే కాకుండా వైకుంఠ దామాలలో మీటర్లు పెట్టారని ఒక్క బల్పు ,ఒక్క ఫ్యాన్ లేక పోయిన 1500 రూపాయల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయని గ్రామ పంచాయతీలు ఆ బిల్లు లు చెల్లించలేని స్థితి లో ఉన్నాయని ప్రభుత్వమే ఆ బిల్లులు చెల్లించాలని అన్నారు..
ఎస్ డి ఎఫ్ నిధుల తో చేపట్టిన పనులకు ఎంబీలు చేసి నెలలు గడిచిన బిల్లులు రాలేదని లక్షల రూపాయలు పెండింగ్ లో ఉండటంతో అప్పులు పాలవుతున్నారని సర్పంచులు తమ బాధలు చెప్పుకున్నారు. దళితబంధును, ఆసరా పెన్షన్లు,ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కమిషన్లు కోసం కాకుండా గ్రామసభల ద్వారా తీర్మానం చేసి ఎంపిక చేయాలని అన్నారు.
చిల్లర రాజకీయాలు ,దోపిడీలు చేసే వారు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండరు అన్నారు..
ఎమ్మెల్యే సైది రెడ్డి (ఒక్కసారి ఎమ్మెల్యే) మాత్రమే అని అన్నారు. ప్రభుత్వం ఉండేది ఆరు నెలలు మాత్రమే నని ఈ అవినీతి ఎమ్మెల్యే లు ఎటు పోతారో చూద్దాం అని అన్నారు.. యస్. టి. ఓ లు,సంబంధిత అధికారులు సర్పంచ్ ల దగ్గర కమీషన్లు తీసుకోవడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు..
ఈ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశముఖ్,రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, యం.పి.పి గోపాల్,జెడ్పీటీసీ మోతీలాల్,మంజునాయక్,కోనతం చిన్న వెంకటరెడ్డి,అంజన్ రెడ్డి,గోవిందా రెడ్డి,కొట్టే సైదేశ్వ ర రావు, బచ్చల కూరి బాబు, కుక్కడపు మహేష్,ముక్కంటి, కృష్ణ,రాము,జితేందర్ రెడ్డి,కాంగ్రెస్ సర్పంచ్ లు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Comments
Post a Comment