ధరణి నీ అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం స్కాం

 ధరణి వైరస్ కంటే భయంకర స్కాం...?


- రైతులను పిడిస్తుంది

- ధరణి నీ అడ్డం పెట్టుకొని

  కల్వకుంట్ల కుటుంబం స్కాం

  లు చేస్తుంది

- ధరణి అవకతవకలపై

  ప్రజాస్వామ్యబద్దంగా దీక్ష

- అరెస్ట్ చేయటం దౌర్జన్యం

- బీజేపీ నిజామాబాద్ ఎంపీ

  ధర్మపురి అరవింద్




సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి


కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డిని అరెస్టు చేయడం పై స్పందిస్తూ అక్రమ అరెస్టుల పర్వం ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేశారు ప్రశ్నించే వారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గొంతు నొక్కిస్తుందని ధ్వజమెత్తారు. జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.దరణితో రైతు గోస కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బయల్దేరిన బీజేపి కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ని అరెస్ట్ చేసి రామారెడ్డి పోలీస్ స్టేషన్ తరలించిన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ సంఘీభావం తెలపడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలలో రమణ రెడ్డి అరెస్ట్ నీ నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేయటం జరిగింది. అనంతరం  మీడియా మిత్రులతో మాట్లాడుతూ,రైతులు స్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కాకపోతే కట్టిన డబ్బులు తిరిగి వస్థలే..? ధరణి తో రైతుల దగ్గర దోపిడీ,ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న బాధితుల్లో నేను కూడా ఒక వ్యక్తిని అని,మా నాన్న భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకుందాం అన్నా కావడం లేదు భూ మాఫియా కోసమే ధరణి

హైదరాబాద్ చుట్టూ పక్కల వేల కోట్ల విలువ గల భూములు ధరణినీ అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంతుంది.

కల్వకుంట్ల కుటుంబ స్కాం లు అన్ని తొందరలోనే బయటకి వస్తాయి.రైతుల పంటలకు ధరలు లేవు, యూరియా లేదు, అన్ని వ్యవస్థలు నాశనం చేశారు.రైతు బంధు పేరుతో రైతులను నిండా ముంచారు.

మళ్ళీ కొత్తగా దళిత బందు పేరుతో దోపిడీ,డబల్ బెడ్ రూమ్ పేరిట మోసం ఇళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన నిధులు మళ్లించారు.

మరో సారి మోసం కోసమే ప్లాట్ ఉన్న వారికి ఇల్లు కట్టుకుంటే 3లక్షల హామీ

మునుగోడు కోసం గిరిజన బందు,యూనివర్సిటీ లు కూడా నాశనం అయ్యాయి, చివరకి మెస్ లు కూడా బాగా లేవు ఎన్నారై లకి శఠగోపం పెట్టారు.తెలంగాణా లో విద్య, వైద్యం, రెవెన్యూ, వ్యవసాయం అన్ని దోపిడీ,గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారు.

రోడ్లు అధ్వాన్నంగా మారాయి.

మొన్న వరదల్లో పంట నష్ట పోతే రూపాయి కూడా ఇవ్వళే

ఉద్యమాలు చేస్తే పోలీసుల తో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.ఇదే పోలీసులతో కల్వకుంట్ల కుటుంబాన్ని జైలు లో వేస్తాం

పైకి బతుకమ్మ, లోపల సారా, లిక్కర్ దందా,కల్వకుంట్ల కుటంభంలో ఒకలు సారా, ఇంకొకలు డ్రగ్స్ వ్యాపారం అయితే పెద్దాయన జాతీయ పార్టీ అంటున్నాడు.

డబల్ బెడ్ రూం లానే జాతీయ పార్టీ కూడా రోజు వాయిదా వేస్తున్నారు. 

కామారెడ్డిలో బీజేపీ గెలుస్తుంది

కామారెడ్డి లో వెంకట రమణ రెడ్డి పోరాటాలు హర్షణీయం

బీజేపీ ప్రభుత్వం రాగానే ధరణి నీ యెత్తేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని,దసరా కి కూడా సమయానికి జీతాలు ఇచ్చే స్థితిలో లేదు ప్రభుత్వం

కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చి కోట్లు ఇస్తా అన్నారు. కాని ఇవ్వాళే, ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇచ్చిన తర్వాతనే రావచ్చు కదా...! కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మూడింటిలో 2 న్నర లక్షల కోట్ల స్కాం,గీత కార్మికులకు, పాడి రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.తెరాస

మానిఫెస్టో ఒక్కటి కూడా అమలు కాలే కామారెడ్డిలో చేస్తున్న ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. అని ధ్వజమెత్తారు.

Comments