జాతీయస్థాయి ఒకటి, మూడు ర్యాంకులతో మెరిసిన పలమనేరు ఆణిముత్యాలు

జాతీయస్థాయి ఒకటి, మూడు ర్యాంకులతో మెరిసిన పలమనేరు ఆణిముత్యాలు

పలమనేరు నియోజకవర్గం, సి కె న్యూస్ ప్రతినిధి.


ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు జూన్  2022 సంవత్సరంలో నిర్వహించిన, సీఎంఏ ఇంటర్ ఫలితాలలో, పలమనేరుకు చెందిన రాజేష్ కుమారుడు రిషబ్ ఓస్వాల్ జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు, పలమనేరుకు చెందిన భాగీరథి లక్ష్మీపతి కుమారుడు భాగీరథి శశి శ్రీనివాస్ జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించారు.

   వీరిద్దరూ ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు ,పలమనేర్ లో గల ఈమాస్ పాఠశాల నందు విద్యను అభ్యసించారు. చదువులో ఎల్లప్పుడూ... ముందుండే వీరు, అదే పాఠశాలలో మ్యాస్ ఒలింపియాడ్, సైన్స్ ఒలింపియాడ్ లో స్వర్ణ పతకాలు మరియు మెమెంటోలను సర్టిఫికెట్లను పొందారు. ఐ సి ఎస్ సి అనుబంధం ఉన్న ఈ పాఠశాలలో పదవ తరగతిలో రిషబ్ 97.5 మరియు శశి శ్రీనివాస్ 96% లతో జాతీయస్థాయి ర్యాంకులు పొందారు.

    ఇంటర్మీడియట్ గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఎంఈసి గ్రూప్ తీసుకొని, ఎంఈసిలో రిషబ్ 95℅, శశి శ్రీనివాస్ 97% సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందారు.

    మాస్టర్ మైండ్స్ కాలేజీలో చదివి, సి ఎ ఫౌండేషన్లో రిషబ్, 345 మార్కులు, శశి శ్రీనివాస్  330 మార్కులు సాధించి జాతీయస్థాయి ర్యాంకులు సాధించారు.

   సీఎంఏ ఫౌండేషన్లో, రిషబ్ జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు, శశి శ్రీనివాస్ రెండవ ర్యాంకు సాధించారు.

   సి ఎ ఇంటర్లో, రిషబ్ జాతీయ స్థాయిలో 8వ ర్యాంక్, శశి శ్రీనివాస్10 ర్యాంకు సాధించారు.

   తాజాగా జరిగిన సీఎంఎ ఇంటర్ ఫలితాలో... జాతీయ స్థాయిలో రిషబ్ మొదటి ర్యాంకు, శశి శ్రీనివాస్ మూడవ ర్యాంకు సాధించారు.


   ఇద్దరు ప్రస్తుతం, వరల్డ్ బిగ్ ఫోర్ కంపెనీ అయిన కెపిఎంజీలో ఇంటర్నెట్ షిప్ చేస్తున్నారు.


     ఇద్దరు విద్యార్థులు పలమనేరు వారు కావడం, పలమనేర్ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలపడంతో, గౌరవ పలమనేరు శాసనసభ్యులు వెంకటే గౌడ, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఆర్డీవో పద్మావతి గార్ల చేతుల మీదుగా సన్మానించడం తెలిసిందే. తాజాగా మరో రెండు జాతీయస్థాయి ర్యాంకులు పట్ల పలువురు తమ ఆశీస్సులను, శుభాభినందనలను తెలియజేశారు.

Comments