ఇచ్చిన హామీ ని నెలబెట్టుకున్న సీఎం కేసీఆర్

 ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు



TS: ST రిజర్వేషన్లను 6 నుంచి 10శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొంది. విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది. ఇటీవల CM KCR రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 60% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. STలకు 4% రిజర్వేషన్లు పెంచడంతో 64 శాతానికి చేరాయి.

Comments