శిధిలమవుతున్నగోడలపై నూతన భవన నిర్మాణం...?

 *శిధిలమవుతున్నగోడలపై నూతన భవన నిర్మాణం...?*


 *పాత బడి వద్దు కొత్త బడే ముద్దు...*


*పాతబడిపై నూతన నిర్మాణం...*


*సుమారు 40 సంవత్సరాలు పైచిలుకు గోడలపై నిర్మాణం...*


*మనఊరు-మనబడి నిర్మాణ పనులతో  ఇష్టారాజ్యం...*


*ప్రశ్నించిన తల్లిదండ్రులపై ఇంజనీర్  తిరుగుబాటు...*


*జిల్లా కలక్టర్ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల ఆవేదన...*


CK న్యూస్ ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రాంతంలోని మసీద్ రోడ్ నందు ఉన్న ఎంపీపీఎస్ పాఠశాల ఎంతో పురాతనమైనది పాఠశాల అని స్థానిక తల్లిదండ్రులు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి నిర్మాణం పేరుతో పాఠశాలల మరమ్మతుల నిర్మాణం కోసం 18 లక్షల రూపాయల పైచిలుకు   వెచ్చించింది.


పురాతన పాఠశాలలను తొలగించి నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పాఠశాల ఎస్ఎంసీ కమిటీ సభ్యులతో కలిసి తీర్మానం చేసిన సంగతి  తెలిసిందే.


అయితే పట్టణంలో సుమారు 40 సవంత్సరాల పై చిలుకు ఎంపీపీఎస్ పాఠశాల ఉందని ఆపాఠశాల గోడలు గతంలో పిల్లర్ లేకుండా నిర్మించడం జరిగిందని ఇప్పుడు ఆ గోడలు  కూలిపోయే స్థితిలో ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పుతున్నారు.


మనఊరు మనబడి పేరుతో ఎంపీపీఎస్  నూతన పాఠశాల నిర్మాణం చేపట్టాల్సింది ఉండగా  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాత పాఠశాలపైనే నిర్మాణం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు

పాత బడి వద్దు కొత్త బడే ముద్దని తల్లిదండ్రులు చెబుతున్నారు.


గత కొన్ని సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ఇదే బడిలో చదువుకున్నామని అప్పుడే గోడలు, కూలిపోయే స్థితిలో ఉండేయని తెలిపారు.


అలాంటిది ఏ ఉద్దేశంతో పాత బడిపై నిర్మాణం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.


ప్రభుత్వం నూతన నిర్మాణం చేపట్టామని నిధులు కేటాయిస్తే  నిధులు పక్కదారి పట్టించి పాతబడిపై అడపా దడపా నిర్మాణం చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


 ఈ విషయమై భవన నిర్మాణం  పరిరక్షిస్తున్న  ఇంజనీర్ ను ప్రశ్నిస్తే మీకేం తెలుసు మా కంటే ఎక్కువ మీకు తెలుసా అంటూ తల్లిదండ్రుల పై తిరుగుబాటు చేస్తున్నాడని చెబుతున్నారు.


ఇప్పటికైనా జిల్లా కలక్టర్ స్పందించి గాలిలో నిర్మించే భవనాలు కాకుండా పూర్తిస్థాయిలో పాఠశాల భవనాన్ని నిర్మించేలా చర్యలు తీసుకొని  వీరికి ఇచ్చినటువంటి లైసెన్స్ రద్దు చేసి మరో కాంట్రాక్టర్ తో మరో ఇంజనీరును పెట్టి  నూతన భవనం నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


లేనిచో పాఠశాల భవనం ముందు నిరాహార దీక్ష చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు...

Comments