తల్లిని చంపిన తనయుడు..
సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
నవ మాసాలు మోసి కాయ కష్టం చేసి పెద్దగా చేస్తే కాటికి పోయేవరకు తనకు అండగా ఉంటాడని భావించిన ఓ తల్లికి కన్నకొడుకే కాల యముడుగా మారాడు. కన్న తల్లిని అని చూడకుండా తల్లిని హత్య చేశాడు ఓ కాల యముడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మొగ గ్రామంలో చోటుచేసుకుంది.మద్నూర్ మండలం మొఘ గ్రామంలో కన్న కొడుకు తల్లిని హత్య చేయడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు ఏర్పడినాయి. మద్నూర్ ఎస్. ఐ. శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.
బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తున్న తల్లి పింజరి ఇస్మాయిల్ భీ (55) ను కొడుకు పింజరి సలాహోద్దీన్ హత్య చేయడం జరిగిందని తెలిపారు. మృతురాలుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని కుటుంబం తో కలిసి వేరే ఇంట్లో ఉండటం జరుగుతుంది. నెరస్థుడు ఇంకొక కుమారుడు సలాహోద్దీన్ కు కూడా పెళ్లి చేస్కోవడం జరిగింది. సలాహోద్దీన్ భార్య గత రెండు సంవత్సరాల క్రితం గుండె నొప్పితో చనిపోవడంతో బతుకు దెరువు కోసం హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటూ జీవనం గడపడం జరుగుతుందని తెలిపారు. రెండేళ్ల క్రితం భార్య గుండెపోటుతో చనిపోవడంతో రెండో పెళ్లి చేయాలంటూ తల్లి పై ఒత్తిడి తీసుకురావడంతో ఆమె నిరాకరించడంతో తల్లిని హత్యకు సలవుద్దీన్ పాల్పడినట్లు తెలుస్తుంది.
Comments
Post a Comment