గుర్తుకోయ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం పోలీసులు

 దుమ్ముగూడెం మండలం ములకనాపల్లి గుర్తుకోయ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం పోలీసులు.

కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్

CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి 


బుధవారము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని గుత్తి కోయ గ్రామం ములకనాపల్లిలో దుమ్ముగూడెం పోలీసులు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్య చికిత్సలు చేసి వారికి ఉచితంగా మందులను అందజేయడం జరిగిందని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్ తెలియజేశారు. అనంతరం గ్రామంలోని చదువుకునే పిల్లలకు పుస్తకాలు,పెన్నులను అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ  మాట్లాడుతూ జిల్లా డా.వినీత్.జి  ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో కనీస అవసరాలు లేకుండా నివసించే ప్రజల ఆరోగ్య సమస్యలు మరియు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ రోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఏజెన్సీ ప్రాంత ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం జిల్లా ఎస్పీ  ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని తెలియజేసారు. గ్రామంలోని ఇతర సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్,ఎస్సైలు రవి,కేశవ, వైద్యులు చైతన్య మరియు సిబ్బంది పాల్గోన్నారు.

Comments