పండుగ సెలవులకు ఇంటిని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసు వారికి సమాచారం అందించాలి:సీఐ వసంత్ కుమార్
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంజిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపీఎస్ మరియు కొత్తగూడెం డిఎస్పి ఎస్. వెంకటేశ్వర బాబు ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంత ప్రజలు దసరా సెలవుల సందర్భంగా ఊరు వెళ్లే వారు సమాచారం అందించాలని తెలియజేసినారు మరియు
9347064123 నంబరుకు వాట్సాప్ ద్వారా వారి పూర్తి వివరాలను మరియు గూగుల్ లొకేషన్ ను పంపించడం ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ వారి నిఘా ఏర్పాటు ఉంటుంది అని
👉 పోలీసు బీట్/ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని
👉 గస్తి సమయంలో మీ ఇల్లు ఉన్న ప్రాంతాన్ని ఎక్కువసార్లు విజిట్ చేయడం జరుగుతుందని
👉 సాధ్యమైనంతవరకు విలువైన వస్తువులను, బంగారు /వెండి ఆభరణాలను & నగదును తమ ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
👉 మీ ఇంటికి నాణ్యమైన తాళాలు వేయాలని
👉 ఒకవేళ మీ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నట్లయితే వాటిని మధ్య మధ్యలో పరిశీలించుకోవాలని
👉 ఎవరైనా కొత్త వ్యక్తులు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు మీకు సమాచారం తెలిస్తే ఆలస్యం చేయకుండా డయల్ 100కు ఫోన్ చేయాలని
👉 మీ ఇంటి పక్కన ఉన్న వారికి కూడా అప్పుడప్పుడు ఫోన్ ద్వారా కాంటాక్ట్ లో ఉండాలని,
కాగా దొంగతనాలను అరికట్టడంలో భాగంగా జిల్లా ఎస్పీ & డిఎస్పి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసారు.
Comments
Post a Comment